‘కిలో’ పాలు 33 రూపాయిలు..హలో..మీకర్థమైందా?!

‘కిలో’ పాలు 33 రూపాయిలు..హలో..మీకర్థమైందా?!

kurnool: sell milk in kilograms : కిలో పాలు కేవలం 33 రూపాయలు. ఏంటి..మతేమన్నా పోయిందా? పాలు, నీళ్లను లీటర్లు అంటారని కూడా తెలీదా? కిలో పాలు అంటారేంటీ? లీటరు పాలు అనాలి? అని సుద్దులు చెబుదామనుకుంటున్నారా? అదేం కాదు..మీరు విన్నది కరెక్టే..కిలో పాలు రూ.33. ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ పాడి రైతులు ఇలా కిలోల్లో పాలను అమ్ముతున్నారు..!! ఇదేం విడ్డూరమండీ అని దీర్ఘాలు తీయొద్దు..అసలు విషయం ఏంటంటే..

కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండలం డి.కొట్టాలలో పాడి రైతులు స్వచ్ఛమైన పాలు కిలో రూ.33కే అమ్ముతున్నారు. అది కూడా పాలు బర్రె దగ్గర అప్పుడప్పుడు పితికి కిలో తూకం వేసి మరీ అమ్ముతున్నారు. దీంతో ఒక్క కర్నూలులోనే కాక అదే జిల్లాలోని నంద్యాల నుంచి వచ్చి పాలను కిలోల్లో కొనేసుకుంటున్నారు జనాలు..

దీనికి కారణమేమంటే..కొట్టాలలో పాల డెయిరీ లేకపోవడంతో పాలను కిలోల్లో అమ్మాల్సి వస్తోందని అక్కడి పాడి రైతులు వాపోతున్నారు. దీని కోసం సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎటువంటి ఫలితం లేదనీ..దీంతో ఖర్చులు ఎక్కువ..ఆదాయం తక్కువ కావటంత పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అదికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుని పాల డెయిరీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు కిలోల పాలు అమ్ముతున్నామని పాడి రైతు చెబుతున్నారు. రెండు కిలోల పాలు రూ.66 మాత్రమే వస్తోందని.. ఒక గేదెకు నెలకు 50 కిలోల తవుడు..ఉలవలు, ఇంకా ఇతర దాణాలు పెడుతున్నామని.. తవుడు ఖరీదు ఎక్కువగా ఉండటంతో ఖర్చు బాగా పెరిగిందని వాపోతున్నారు. పాలు విక్రయిస్తే వచ్చే ఆదాయం అంత బర్రె తవుడుకే సరిపోతుందని..ఇక గేదె దాణాల ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు కర్నూలు పాడి రైతులు..