Beggar Lakhs : యాచకుడి ఇంట్లో లక్షల రూపాయలు.. విస్తుపోయిన అధికారులు

అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్షలు ఉంది.

Beggar Lakhs : యాచకుడి ఇంట్లో లక్షల రూపాయలు.. విస్తుపోయిన అధికారులు

Beggar Lakhs

Beggar Lakhs : అతడో యాచకుడు. రోజంతా యాచించడమే పని. అలా వచ్చిన డబ్బుతో బతుకు సాగిస్తున్నాడు. చూసినోళ్లంతా అతడు చాలా పేదవాడని అనుకున్నారు. కానీ, కట్ చేస్తే.. ఆ యాచకుడు లక్షాధికారి అని తేలింది. అతడి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అంతా లెక్క వేస్తే అక్షరాల 6లక్షలు ఉంది.

తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో ఏకంగా రూ.6 లక్షలు బయటపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శేషాచల నగర్ లోని అతడి నివాసంలో నోట్ల కట్టలు వెలుగుచూశాయి. ఆ యాచకుడి పేరు శ్రీనివాసన్. తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల దగ్గర భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్ లో ఇంటిని కేటాయించారు.

అయితే, శ్రీనివాసన్ అనారోగ్య కారణాలతో గతేడాది మరణించాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో శేషాచల నగర్ లోని అతడి నివాసాన్ని టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఇంట్లో రెండు ట్రక్కు పెట్టెలు కనిపించాయి. అవి తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి. వాటి విలువ రూ.6 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది వాటిని లెక్క పెట్టారు.

గంటన్నరకు పైగా లెక్కించారు. డబ్బు లెక్కింపు కోసం కరెన్సీ కౌంటింగ్ మెషీన్ తెప్పించారు. దాదాపు 5మంది సిబ్బంది నగదు లెక్కించారు. శ్రీనివాసన్ చాలా ఏళ్లపాటు తిరుమల కొండపై నివాసం ఉన్నాడు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా టీటీడీ అధికారులు కొండపై నివాసం ఉంటున్న వారిని బలవంతంగా కిందకు పంపేసింది. తిరుమల నిర్వాసితుడిగా భావించి నగరు శివారులోని శేషాచల కాలనీలో శ్రీనివాసన్ కు ఓ ఇల్లు ఇచ్చారు అధికారులు. అయితే అనారోగ్యంతో శ్రీనివాసన్ మరణించాడు. అతడికి వారసలు లేరు. దీంతో అతడికి కేటాయించిన ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ సిబ్బంది వెళ్లారు.

తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో వారికి రెండు ట్రక్కు పెట్టెలు కనిపించాయి. ఆ పెట్టెలు ఓపెన్ చేసి చూడగా షాక్ తిన్నారు. అందులో నోట్ల కట్టలు ఉన్నాయి. వెంటనే వారు విజిలెన్స్ కు సమాచారం ఇచ్చారు. విజిలెన్స్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. నగదుని లెక్కిస్తున్నారు. శ్రీనివాసన్ కొండపై చాలా రకాలుగా డబ్బు సంపాదించే వాడు. యాచకుడిగా చాలా ఏళ్లు కొనసాగాడు. తిరుమలకు వచ్చే యాత్రికుల నుంచి యాచించే వాడు. శ్రీనివాసన్ ఇంట్లో దొరికన ట్రంకు పెట్టెలో కొన్ని నోట్లు రద్దు చేసినవి(రూ.500, వెయ్యి రూపాయలు) కూడా ఉన్నాయి. అలాగే కొత్త రూ.2వేల నోట్లు కూడా ఉన్నాయి.