జనసేనలో నా ప్రయాణం ముగిసిన అధ్యాయం : ఇకపై అదే నా పని

జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Published By: veegamteam ,Published On : February 3, 2020 / 04:53 AM IST
జనసేనలో నా ప్రయాణం ముగిసిన అధ్యాయం : ఇకపై అదే నా పని

జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీకి రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ పలు ఆక్తికర విషయాలు వెల్లడించారు. తన రాజీనామాపై ఆయన స్పందించారు. తన రాజీనామా ఆమోదం పొందిందన్నారు. తన రాజీనామాకు కారణాలను రాజీనామా లేఖలోనే తెలిపానని చెప్పారు. ఇక ముందు కూడా ప్రజా సేవ చేస్తానని వెల్లడించారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్‌ ను సోమవారం(ఫిబ్రవరి 03,2020) ప్రారంభిస్తున్నానని… ఇకపై ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలిపారు. ప్రజలు, రైతు సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. 

సినిమాలు చేయడం ఇష్టలేకనే:
సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వి.వి.లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ విధానాల్లో నిలకడ లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకే సమయం వెచ్చిస్తానని చెప్పిన పవన్.. సినిమాల్లో నటించడం నచ్చకే తప్పుకుంటున్నట్లు ఆయన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. లక్ష్మీనారాయణ వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

నాకు తెలిసింది సినిమా ఒక్కటే:
లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామన్న పవన్.. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. పార్టీని నడిపేందుకు తనకు ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, గనులు లేవని.. సినిమాలే తనకున్న ఏకైక ప్రత్యామ్నాయమని పవన్ తేల్చి చెప్పారు. అవన్నీ తెలుసుకుని ఉంటే బాగుండేదని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు. ‘వి.వి.లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాం. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నాం. నాకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవు. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాను. నాకు తెలిసిందల్లా సినిమా ఒక్కటే. నా మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. వారి కోసం, నా కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి’ అని పవన్ తేల్చి చెప్పిన విషయం విదితమే.