YSR Vahana Mithra : రూ.10వేల కోసం నేడే చివరి అవకాశం.. ఇల్లా అప్లయ్ చేసుకోండి

ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది.

YSR Vahana Mithra : రూ.10వేల కోసం నేడే చివరి అవకాశం.. ఇల్లా అప్లయ్ చేసుకోండి

Ysr Vahana Mithra

YSR Vahana Mithra : ఏపీ ప్రభుత్వం డ్రైవర్ల కోసం తీసుకొచ్చిన పథకం వాహనమిత్ర. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ స్కీమ్ కి సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి నిన్నటితో(జూన్ 8,2021) గడువు ముగిసింది. అయితే సర్వర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల బుధవారం(జూన్ 9,2021) వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలింది. కాబట్టి వాహన మిత్ర కోసం ఇవాళ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. అర్హులైన వారు వాహనం ఫొటోతో వాలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వాహన మిత్ర ద్వారా ప్రతి ఏటా రూ.10 వేల సాయం అందిస్తోంది ప్రభుత్వం. కరోనాతో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా గతేడాది కంటే ఈ సారి నెల ముందే ఆర్థిక సాయం అందనుంది. కొత్తగా వాహనాలు కొన్నవారు ఆర్థిక సాయం కోసం 9 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు విచారణ పూర్తి చేసి అర్హులైన వారికి రూ.10 వేల సాయం అందిస్తారు.

వేరొక పథకంలో లబ్ది పొందుతున్న వారు, ప్రభుత్వ పించన్ పొందుతున్న వారు ఈ స్కీమ్ కి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం సహా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు కూడా పథకానికి అనర్హులు. ఇప్పటికే లబ్ది పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జాబితాలో పేరున్న వారు వారి ఆటో, ట్యాక్సీతో ఫొటో దిగి వాలంటీర్ ద్వారా అప్ లోడ్ చేయాలి. ఈ నెల 15న సీఎం జగన్ వాహనమిత్ర పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు.

జూన్‌ 15న లబ్ధిదారులకు సాయం:
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాలు, రవాణా శాఖ ఉప కమిషనర్‌ కార్యాలయాల దగ్గర ప్రదర్శించారు. ఇప్పటికే అర్హులు, కొత్త వాహనాలు కొనుగోలుదారులు, యాజమాన్య హక్కులు బదిలీ అయిన వారి వివరాలు ఈ జాబితాలో ఉంటాయి.