Laxmi Parvathi on NTR university: బాలకృష్ణకి పెట్టిన పోస్టు చదవడం కూడా చేతకాదు: లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇవాళ ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ‘‘వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఆఫీస్ నుంచి రాసి పంపించి ఉంటారు.. బాలకృష్ణ పోస్ట్ పెట్టి ఉంటారు.. బాలకృష్ణకి పెట్టిన పోస్టు చదవడం కూడా చేతకాదు. బాలకృష్ణ జీవితాన్ని కాపాడింది వైఎస్ఆర్ అది మర్చిపోకూడదు.. వర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. సీఎం జగన్ చెప్పింది కన్విన్సింగ్ గా ఉంది. త్వరలోనే సీఎం జగన్ ని కలుస్తా.. ఇంకో పెద్ద ప్రాజెక్టు దేనికైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరతా’’ అని అన్నారు.

Laxmi Parvathi on NTR university: బాలకృష్ణకి పెట్టిన పోస్టు చదవడం కూడా చేతకాదు: లక్ష్మీ పార్వతి

Laxmi Parvathi on NTR university

Laxmi Parvathi on NTR university: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి స్పందించారు. ఇవాళ ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ‘‘వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ ఆఫీస్ నుంచి రాసి పంపించి ఉంటారు.. బాలకృష్ణ పోస్ట్ పెట్టి ఉంటారు.. బాలకృష్ణకి పెట్టిన పోస్టు చదవడం కూడా చేతకాదు. బాలకృష్ణ జీవితాన్ని కాపాడింది వైఎస్ఆర్ అది మర్చిపోకూడదు.. వర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. సీఎం జగన్ చెప్పింది కన్విన్సింగ్ గా ఉంది. త్వరలోనే సీఎం జగన్ ని కలుస్తా.. ఇంకో పెద్ద ప్రాజెక్టు దేనికైనా ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరతా’’ అని అన్నారు.

‘‘చంద్రబాబు హయాంలో ఒక్క శాశ్వత పథకానికి ఎన్టీఆర్ పేరు పెట్టారా? జిల్లాకి ఎన్టీఆర్ పేరు కావాలా.. వర్సిటీకా అని నన్ను అడిగితే జిల్లాకే ఆ పేరు ఉండాలని అని చెబుతా. విజయవాడ లాంటి జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టడం మామూలు విషయం కాదు. జిల్లా పెద్దది చరిత్రలో నిలిచిపోతుంది.. యూనివర్సిటీ చాలా చిన్నది. జిల్లాకి పేరు పెట్టినప్పుడు కుటుంబ సభ్యులు ఒక్కరు మాట్లాడలేదు.. ఇప్పుడు మాట్లాడుతున్నారు’’ అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.

‘‘ఎన్టీఆర్ కి భారతరత్న రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు. ఒకప్పుడు నాపై అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు జూ ఎన్టీఆర్ పై విష ప్రచారం చేస్తున్నారు.. జూ.ఎన్టీఆర్ కి ఉన్న సంస్కారంలో కొంత కూడా లోకేశ్ కి లేదు. తన కొడుక్కి అడ్డం వస్తాడని జూ. ఎన్టీఆర్ పై చంద్రబాబు కక్ష కట్టారు. టీడీపీలో జూ.ఎన్టీఆర్ ని తీసుకురావాలని ఒత్తిడి ఉంది.. అది పోగొట్టడానికి ఇలా చేయిస్తున్నారు.

జూ.ఎన్టీఆర్ సినిమాలు కూడా అడనివ్వమని చెప్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. దయాకర్ పై టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కి లేఖ రాశాను.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఎర్రబెల్లికి చంద్రబాబు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? భువనేశ్వరి వజ్రాల వడ్డాణం అడిగిందా?.. అది ఇవ్వలేక మంత్రి పదవి రాలేదా? వెన్నుపోటు లో మొదటి వ్యక్తి దయాకర్. అందుకే అప్పట్లో ఆయనకు మంత్రి పదవి రాలేదు.. షర్మిల పక్క రాష్ట్రంలో ఉంది.. ఆమె గురించి మాట్లడను..’’ అని లక్ష్మీ పార్వతి చెప్పారు.

COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు