లెబనాన్ లోపేలుళ్లు..విశాఖలో భయం..భయం, ఎందుకు ?

  • Published By: madhu ,Published On : August 7, 2020 / 03:14 PM IST
లెబనాన్ లోపేలుళ్లు..విశాఖలో భయం..భయం, ఎందుకు ?

లెబనాన్ పేలుళ్లతో..విశాఖలో ఆందోళనకర వాతావరణం ఏర్పడుతోంది. బీరూట్ లో అమ్మోనియం నైట్రైట్ పేలడంతో…విశాఖ జనాల గుండెలు అదిరి పడుతున్నాయి.ఎందుకంటే..అక్కడ పేలింది…2 వేల 750 టన్నుల అమ్మోనియం నైట్రైట్. ఈ పేలుడు ధాటికే అక్కడ పెను విధ్వంసం జరిగిపోయింది.



కొన్ని కిలోమీటర్ల మేర..భవనాలు నాశనమయ్యాయి. పేలుడు శబ్ధం..200 కిలోమీటర్ల దూరం వినిపించింది. ఇప్పుడు విశాఖ పోర్టుకు కూడ అదే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా..అమ్మోనియం నైట్రైట్ నిల్వలు భారీగా ఉన్నాయి. ఇక్కడి పోర్టు ద్వారా..భారీగా అమ్మోనియం నైట్రైట్ దిగుమతి జరుగుతుంటుంది.

రష్యా, గల్ఫ్ దేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా..ప్రైవేటు వినియోగదారులు అమ్మోనియం నైట్రైట్ ను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుంటారు. నౌకల నుంచి అన్ లోడ్ చేసుకుని..సమీపంలో ఉన్న గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. తర్వాత ఒడిశా, బీహార్, ఛత్తీస్ గడ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఇతర రాష్ట్రాలకు దిగుమతి చేస్తుంటారు. ఏటా రెండు లక్షల టన్నుల అమ్మోనియం నైట్రైట్ దిగుమతి అవుతుందని అంచనా.

2018-19లో విశాఖ పోర్టులో 2.60 లక్షల టన్నుల అమ్మోనియం నైట్రైట్ దిగుమతి జరిగింది. సగటున విశాఖ పోర్టులో 30 వేల టన్నుల నిల్వ ఉంటుంది. అంటే..బీరూట్..లో ఉన్నదానికంటే..పది రెట్లు ఎక్కువ. ఇదే ఇప్పుడు ఆందోళన నెలకొంటోంది. అమ్మోనియం నైట్రైట్ ను విశాఖలోని ఆరు ప్రదేశాల్లో నిల్వ ఉంచుతున్నరు. అమ్మోనియం నైట్రైట్ ఏ విధంగ తనిఖీ చేస్తున్నారో తెలియడం లేదు. ఏదైనా జరిగితే..విశాఖలో చరిత్రలో జరగని విధ్వాంసాన్ని చూడాల్సి వస్తుంది.



అమ్మోనియం నైట్రైట్ కు పేలుడు స్వభావం కలిగి ఉంది. దీనిన ఎరువుల తయారీలో ఉపయోగిస్తుంటారు. అంతేగాకుండ..గనులు, గ్రానైట్, రాయి పేలుళ్లలో ఉపయోగిస్తుంటారు. ఈ అవసరాల కోసమే..వినియోగిస్తుంటారు. అయితే..సంఘ విద్రోహశక్తులు అక్రమమార్గం గుండా..అమ్మోనియం నైట్రైట్ చేజిక్కించుకుని..తయారీకి ఉపయోగిస్తున్నారు.



కేవలం అరకిలో అమ్మోనియం నైట్రైట్ తో వంద మీటర్ల పరిధిలో విధ్వంసం చేయవచ్చు. ఇందువల్ల అమ్మోనియం నైట్రైట్ దిగుమతి, రవాణా, నిల్వ చేయడంలో కొన్ని నిబంధనలున్నాయి. ఎక్కడా చిన్నపొరపాటు జరిగినా…భారీ ప్రమాదం తప్పదు. ఇటీవలే విశాఖలో పలు ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టం కూడా సంభవించింది. అమ్మోనియం నైట్రైట్ వ్యవహారంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.