Leopard Attack: గొర్రెల కాపరిపై చిరుతల దాడి

కర్నూలు జిల్లా ఆదోనీ మండలంలో బల్లెకల్ గ్రామంలో గొర్రెల కాపరిపై రెండు చిరుతలు దాడికి పాల్పడ్డాయి. ఆటో తాయప్ప అనే వ్యక్తి ఇంటి వద్ద చిరుతలు అలజడి సృష్టించడంతో

Leopard Attack: గొర్రెల కాపరిపై చిరుతల దాడి

Leopard Attack

Leopard Attack: కర్నూలు జిల్లా ఆదోనీ మండలంలో బల్లెకల్ గ్రామంలో గొర్రెల కాపరిపై రెండు చిరుతలు దాడికి పాల్పడ్డాయి. ఆటో తాయప్ప అనే వ్యక్తి ఇంటి వద్ద చిరుతలు అలజడి సృష్టించాయి. దీంతో ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు.

ఇంటి బయట కట్టేసి ఉన్న గొర్రెలపై దాడి చేయబోతుండటాన్ని తాయప్ప గమనించాడు. గొర్రెలను కాపాడుకునే క్రమంలో చిరుతలను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎదురుతిరిగి దాడికి పాల్పడటంతో ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులేసుకున్నాడు.

Leopard Attack

Leopard Attack

అక్కడ జరిగిన దాడిలో నాలుగు గొర్రెల మృతి చెందాయని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో ప్రాణ నష్టం వాటిల్లలేదు. గతంలో కూడా రెండు మూడు సార్లు చిరుతలు జనావాసాల్లోకి వచ్చేశాయని వాపోతున్నారు.

Read Also: చిరుత పులితో సహా రెండు గంటల పాటు గదిలోనే బాలిక, చివరకు ఏమైంది?

భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు వెంటనే చిరుతలను బంధించాలంటూ ఫారెస్ట్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.