Battery Cycle : పెట్రోల్‌తో పనే లేదు.. బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన లైన్ మెన్, ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 20 కిమీ వెళ్తుంది

ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలను రోడ్డు మీదకు తేవాలంటేనే వాహనదారుల వణికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వాహనాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ తయారు చేశాడు కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన చెన్న బసవస్వామి. డిప్లోమా చేసిన

Battery Cycle : పెట్రోల్‌తో పనే లేదు.. బ్యాటరీతో నడిచే సైకిల్ తయారు చేసిన లైన్ మెన్, ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 20 కిమీ వెళ్తుంది

Battery Cycle

Battery Cycle : ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ ధరలు షాకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాహనాలను రోడ్డు మీదకు తేవాలంటేనే వాహనదారుల వణికిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే వాహనాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ తయారు చేశాడు కర్నూలు జిల్లా కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన చెన్న బసవస్వామి. డిప్లోమా చేసిన అతను ప్రస్తుతం మండలంలోని నదిచాగి గ్రామంలో లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో రాకపోకల కోసం స్కూటర్‌ను వినియోగించేవాడు. ఇటీవల పెట్రోల్‌ ధరలు భారీగా పెరగడంతో ఖర్చు తగ్గించే యోచన చేశాడు. ఇంట్లో ఉన్న పాత సైకిల్‌కు తనకు తెలిసిన కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులను అమర్చి ప్రయోగం చేశాడు.

24 వోల్ట్స్‌, 250 వాట్స్‌ సామర్థ్యం గల మోటారు, 24 వోల్ట్స్‌ 10 ఎహెచ్‌ సామర్థ్యమున్న బ్యాటరీ, ఛార్జింగ్‌ ఇండికేషన్‌, స్పీడ్‌ మీటర్‌ తదితర వస్తువులను అమర్చి బ్యాటరీ సైకిల్‌ తయారు చేశారు. ఈ వాహనానికి ఒకసారి ఛార్జింగ్‌ పెడితే 20 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ప్రస్తుతం స్కూటర్‌కు బదులు ఈ సైకిల్‌నే ఉపయోగిస్తున్నాడు.

ఇందులో బ్యాటరీ సామర్థ్యం పెంచితే మైలేజ్‌ పెరుగుతుందని తెలిపాడు. ఈ సైకిల్‌ ఛార్జింగ్‌ కోసం రోజుకు ఒక యూనిట్‌ కన్నా తక్కువ విద్యుత్‌ ఖర్చువుతుంది. ఇంట్లో సైకిల్‌ ఉంటే, రూ.15 వేలతో దీన్ని తయారు చేయొచ్చు. నెలకు రూ.45 నుంచి రూ.53 విద్యుత్ బిల్లు, ఇంధన ఆదాతోపాటు, సౌకర్యాన్నీ ఈ వాహనంలో పొందవచ్చని బసవస్వామి వివరించాడు.