ఎంత కష్టమొచ్చింది, మందు దొరక్క శానిటైజర్ తాగాడు

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.

ఎంత కష్టమొచ్చింది, మందు దొరక్క శానిటైజర్ తాగాడు

Sanitizer

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అమల్లో ఉండి నెల రోజులు దాటింది. నెల రోజులుగా మందు దొరక్కపోవడంతో మద్యానికి బానిసైన వాళ్లు అల్లాడిపోతున్నారు. కొందరు మందు దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకొందరు కిక్కు కోసం ఏవో పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మద్యం దొరక్కపోవడంతో:
తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు మందు దొరక్కపోవడంతో ఏకంగా శానిటైజర్ తాగేశాడు. జిల్లాలోని పాతూరుకు చెందిన లక్ష్మణ్ మద్యానికి బానిసగా మారాడు. కొద్దిరోజులుగా మద్యం దొరక్కపోవడంతో వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరకు మద్యం దొరక్క శానిటైజర్ తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రోడ్డుపై పడిపోయిన అతడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

పెట్రోల్ లో శానిటైజర్ కలుపుకుని తాగాడు:
కొన్ని రోజుల క్రితం మర్రిపాడు మండలంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి, మందు దొరక్కపోవడంతో పెట్రోల్‌లో శానిటైజర్‌ను కలుపుకుని తాగి మృతి చెందాడు. తూర్పుగోదావరికి చెందిన ఆరుగురు స్నేహితులు మద్యం దొరకడం లేదని ఐసో ప్రొపిల్ తాగారు. వారిలో ఇద్దరు మృత్యువాత పడగా మిగిలిన వారు ఆస్పత్రి పాలయ్యారు. అలాంటి ఘటనే మరొకటి తమిళనాడులో చోటుచేసుకుంది. మద్యం దొరక్క మత్తు కోసం కూల్‌డ్రింక్‌లో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగి ఇద్దరు మరణించారు.

ఇంట్లో మద్యం తయారీ ఎలా? ఆన్ లైన్ లో తెగవెతికేస్తున్నారు
మొత్తంగా లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మందుబాబులు విలవిల్లాడిపోతున్నారు. మద్యం దొరక్క వింత చేష్టలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు మందుబాబులు ఇంట్లోనే మద్యం తయారీ ఎలా అని గుగూల్ లో తెగ వెతికేస్తున్నారు. మార్చి 22-28 మధ్య ఈ టాపిక్ గూగుల్ ట్రెండ్స్‌లో పైపైకి వచ్చింది. కుదిరితే ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవాలని చాలా మంది భావించారనడానికి దీన్ని నిదర్శనంగా భావించొచ్చు.

నాటుసారా, చీప్ లిక్కర్ తాగడానికి రెడీ:
మద్యం దొరకకపోవడంతో కొందరు మందుబాబులు నాటుసారా, చీప్ లిక్కర్ తాగడానికి సైతం సిద్ధపడుతున్నారు. యూపీలో ఇలాగే నాటుసారా తాగి ఇద్దరు చనిపోగా మరో ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారు. మందు దొరక్కపోవడంతో కొందరు పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తుండగా.. మరి కొందరైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీరి బాధ అర్థం చేసుకున్న మేఘాలయ, అసోం లాంటి ఈశాన్య రాష్ట్రాలు మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి ఇచ్చాయి.

లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. తొలుత 21 రోజులపాటే లాక్‌డౌన్ ప్రకటించగా.. కొద్ది రోజులపాటు మందుబాబులు ఎలాగోలా మద్యం సంపాదించారు. కానీ లాక్‌డౌన్‌ను మరో 19 రోజులపాటు పొడిగించడంతో నాలుగు రెట్లు ధర చెల్లించినా సరే లిక్కర్ దొరకడం లేదు. మొత్తంగా మందుబాబుల కష్టాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని జనం జాలి చూపిస్తున్నారు.