అది పరుపా లిక్కర్ షాపా? పరుపులో 6లక్షల విలువ చేసే వెయ్యి మద్యం బాటిళ్లు స్వాధీనం

  • Published By: naveen ,Published On : October 30, 2020 / 05:06 PM IST
అది పరుపా లిక్కర్ షాపా? పరుపులో 6లక్షల విలువ చేసే వెయ్యి మద్యం బాటిళ్లు స్వాధీనం

liquor bottles in bed: ఇన్నిరోజులు డ్రగ్స్‌ .. గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీలో లిక్కర్‌ను తరలించేందుకు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఇన్ని రోజులు లారీల్లో సామాన్ల మధ్య మద్యంను తరిలించిన కేటుగాళ్లు ఇప్పుడు తెలివిమీరారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తీసుకొస్తే పన్ను కట్టాలని ఏపీ నిబంధన తేవడంతో పోలీసుల కళ్లు గప్పేందుకు రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.

అవి మామూలు పరుపులు మాత్రమే కాదు. అవి లిక్కర్‌ పరుపులు. ఆ మ్యాట్రెస్‌ మధ్యలో ఆరు లక్షల విలువైన మద్యం ఉంది. గత కొన్నిరోజులుగా లిక్కర్‌ను లారీలు, వ్యాన్‌లలో తీసుకెళ్తుంటే పోలీసులు పట్టుకుంటున్నారు. దీంతో లిక్కర్ స్మగ్లర్లు రూట్ మార్చారు. మద్యం అక్రమ తరలింపునకు పరుపులను ఎంచుకున్నారు. వాటి మధ్యలో 604 లిక్కర్‌ బాటిళ్లను పెట్టారు. అయినా పోలీసులు చాకచక్యంతో లిక్కర్ స్మగ్లర్ల ఆటకట్టించారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు హైవే చెక్‌పోస్ట్ దగ్గర వెయ్యి మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. మద్యంతో పాటు లక్షా 73 వేల నగదును సీజ్‌ చేశారు. ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. మొదట పరుపులు తరలిస్తున్నారని అనుకున్నామని.. కానీ నిందితుల ప్రవర్తనతో అనుమానం వచ్చి వెతకడంతో లిక్కర్‌ బాటిళ్లు బయటపడ్డాయన్నారు పోలీసులు.