Loan Apps : లోన్ కట్టేసినా టార్చర్ పెడుతున్నారు.. లోన్ యాప్‌ల వేధింపులకు అడ్డాగా నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సామాన్యులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

Loan Apps : లోన్ కట్టేసినా టార్చర్ పెడుతున్నారు.. లోన్ యాప్‌ల వేధింపులకు అడ్డాగా నెల్లూరు జిల్లా

Loan Apps

Loan Apps : నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సామాన్యులు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తీసుకున్న రుణం చెల్లించినప్పటికీ వేధింపులకు గురి చేస్తున్న రికవరీ ఏజెంట్లపై మంత్రి కాకాణికి ఫిర్యాదు చేశారు చైతన్య అనే బాధితుడు. లోన్ చాలావరకు తీర్చానని అయినా వడ్డీల మీద వడ్డీలు వేసి మరింత కట్టాలని వేధిస్తున్నారని చైతన్య వాపోయారు.

Anil Kumar Yadav : రూ.8లక్షలు కట్టండి.. ఆ ఫోన్ ఆడియో లీక్‌పై అనిల్ కుమార్ యాదవ్ సీరియస్

మూడు రికవరీ ఏజెన్సీల ప్రతినిధులు తన బంధువులు, స్నేహితులకు మెసేజ్ లు పంపుతున్నారని ఆరోపించారు. మరికొందరు బాధితులు కూడా మంత్రి కాకాని దగ్గరికి వచ్చారు. అసలు తాము లోన్ తీసుకోకపోయినా అప్పు చెల్లించాలని ఫోన్ చేసి వేధిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ

రికవరీ ఏజెన్సీల వేధింపులపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లోన్ తీసుకున్న వ్యక్తికి కాకుండా ఇతరులకు ఫోన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.