స్థానిక సంస్థల ఎన్నికల రగడ : ఆల్ పార్టీ మీటింగ్, సమావేశానికి దూరంగా వైసీపీ

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 06:46 AM IST
స్థానిక సంస్థల ఎన్నికల రగడ : ఆల్ పార్టీ మీటింగ్, సమావేశానికి దూరంగా వైసీపీ

Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో రోజు రోజుకి రాజకీయ రగడ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఈసీ, అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం చెబుతుంటే…ఈసీ మాత్రం ఎలక్షన్‌పై కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించిన సీఈసీ..2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తుండటం…మరోవైపు ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించకుండా స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం తాజాగా హై కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవ్వడం..పొలిటికల్ హీట్‌ను పెంచింది.



కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అధికార వైసీపీ చెబుతోంది. అందులో భాగంగానే బుధవారం జరగబోయే సమావేశానికి దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలి, బీజేపీ నుంచి పాకా సత్యనారాయణ ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరు కానున్నారు.



సుప్రీం కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ సమావేశాలను నిర్వహిస్తే బాగుండేదని అన్నారు అంబటి రాంబాబు. రాష్ట్ర ప్రభుత్వంతోనే చర్చించకుండా రాష్ట్రంలో ఉనికే లేని, పోటీయే చేయని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను…ఆల్‌ పార్టీ మీటింగ్‌కు నిమ్మగడ్డ పిలిచారంటే దాని మర్మమేంటో మరికొద్ది గంటల్లోనే అందరికీ తెలుస్తుందన్నారాయన.



https://10tv.in/local-body-elections-in-ap-what-is-ap-election-commission-going-to-do/
ఇక రాష్ట్రంలో మూడు వేల కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలనూ అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో….ఎన్నికలు నిర్వహించవచ్చా..? అని రమేష్‌కుమార్‌ అడుగుతున్నారంటే దాని వెనుక ఆయన ఉద్దేశ్యం ఏంటో, దాని వెనుక ఎవరున్నారో స్పష్టం అవుతుందన్నారు.



సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందుకు వెళ్తున్న ఆయన ధోరణిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తిరస్తరిస్తోందని స్పష్టం చేశారు. వైసీపీ వందకు వందశాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లలో విజయం సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం తమకు మాత్రమే కాదని…ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు అంబటి రాంబాబు.



మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదన్న చెబుతున్న ప్రభుత్వం ఆల్‌పార్టీ సమావేశం నిర్వహించకుండా స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తుందని హౌస్‌మోషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమైంది.
మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెబుతున్న ప్రభుత్వం….ఆల్‌పార్టీ సమావేశం నిర్వహించకుండా స్టే ఇవ్వాలని హై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తుందని..హౌస్‌మోషన్‌ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.