పట్టాలెక్కుతున్నాయి : తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు..వివరాలు

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 02:30 AM IST
పట్టాలెక్కుతున్నాయి : తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు..వివరాలు

లాక్‌డౌన్ 4 సడలింపుల్లో భాగంగా ప్రజా రవాణా పునఃప్రారంభమైంది. ఇప్పటికే అన్నిచోట్లా బస్సులు తిరుగుతున్నాయి. త్వరలో దేశీయ విమానాలు కూడా ఎగరనున్నాయి. రైళ్లు కూడా దశల వారీగా పట్టాలెక్కనున్నాయి. అందులో భాగంగా రైల్వేశాఖకు కేంద్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ 2020, మే 21వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

అయితే… ఈ రైళ్లన్నింటినీ ప్రత్యేక రైళ్లుగానే పరిగణిస్తారు. వీటిలో ఏసీ, నాన్ ఏసీ బోగీలు కూడా ఉంటాయి. జనరల్ బోగీలకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ చార్జీలను వసూలు చేస్తారు. ఈ రైళ్ల బుకింగ్స్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉన్నా… వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన వారిని రైళ్లలోకి అనుమతించరు.

జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ… ఆ జాబితాలోని కొన్ని రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో… ముంబై సీఎస్టీ – హైదరాబాద్ , హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, హౌరా – సికింద్రాబాద్ , ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ – హైదరాబాద్, తెలంగాణ ఎక్స్ ప్రెస్, పాట్నా- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్, తిరుపతి – నిజామాబాద్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ – విశాఖపట్నం, గోదావరి ఎక్స్ ప్రెస్‌తోపాటు సికింద్రాబాద్ – నిజాముద్దీన్ దురంతో నాన్ ఏసీ రైలును కూడా పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించింది.

తిరుపతి – నిజామాబాద్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02793/94)
గుంటూరు – సికింద్రాబాద్, గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 07201/02)
సికింద్రాబాద్ (1310) – నిజాముద్దీన్ (1035) దురంతో నాన్ ఏసీ (ట్రైన్ నెంబర్ 02285/12286)
ముంబై సీఎస్టీ – హైదరాబాద్ , హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02701/02)
న్యూ ఢిల్లీ – హైదరాబాద్, తెలంగాణ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02724/23 )
దనపూర్ (పాట్నా) – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02792/91)
హౌరా – సికింద్రాబాద్ , ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02703/04)
హైదరాబాద్ – విశాఖపట్నం, గోదావరి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్ 02727/28 )