ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ 

  • Published By: murthy ,Published On : June 20, 2020 / 03:12 AM IST
ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ 

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా మూడు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు.  శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 465 కేసులు నమోదు అయ్యాయి.  అప్రమత్తమైన అధికారులు కేసులు పెరుగుతున్న ఏరియాల్లో లాక్ డౌన్ అమలు చేయాబోతున్నారు. ఆదివారం జూన్ 21 వతేదీ నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అవసరమైతే నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిధ్ధమవుతున్నారు. 

రాష్ట్రంలో  పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో  మళ్లీ  లాక్డౌన్  ప్రకటించారు. ఆదివారం ఉదయం నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రకాశం జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఒంగోలు, చీరాలలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు జిల్లాకలెక్టర్  తెలిపారు. 

శ్రీకాకుళం జిల్లా పలాసలో  ఇటీవల ఒక ఇంటిలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బంధువుకి  పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మరో  వ్యక్తికి కరోసా సోకింది. దీంతో పలాస కాశీబుగ్గలనుకంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి… నియోజకవర్గం మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు  కలెక్టర్ ప్రకటించారు.

ఇక అనంతపురం జిల్లా కేంద్రంతో సహా ధర్మవరం, తాడిపత్రి, యాడికి, పామిడి, హిందూపురం, కదిరి, గుంతకల్లుల్లో లాక్ డౌన్ విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.  అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇక వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.

Read: ఓటు వేశారు..YCPకి ఓటు వెయ్యలేదు..TDPకి వేశారు..కానీ చెల్లలేదు..బాబు వ్యూహానికి చెక్‌