Lockdown Or Night Curfew : లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ..? తెలంగాణ బాటలో ఏపీ..?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణతో పోలిస్తే ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణాన అయినా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.

Lockdown Or Night Curfew : లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ..? తెలంగాణ బాటలో ఏపీ..?

Lockdown Or Night Curfew In Ap

lockdown or night curfew in ap : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. మరి ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణతో పోలిస్తే ఏపీలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణాన అయినా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కరోనాపై సీరియస్ గా దృష్టి పెట్టిన సీఎం జగన్, ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను ఈ కమిటీ నిరంతరం మానిటర్ చేయనుంది. రాష్ట్రంలో కోవిడ్ కంట్రోల్ రూమ్ ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఐఏఎస్ జవహర్ రెడ్డిని దీనికి చీఫ్ గా నియమించింది. కేబినెట్ సబ్ కమిటీ, కోవిడ్ కంట్రోల్ రూమ్.. ఏపీలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, ఆయా ప్రాంతాల్లో స్థానికంగా విధిస్తున్న ఆంక్షలు, కరోనా హాట్ స్పాట్ లు, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ పై దృష్టి పెడతాయి. అయితే పెరుగుతున్న కేసుల దృష్టా తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది.

అత్యవసర సేవలు, ఇతర ముఖ్యమైన సేవలు తప్ప నైట్ కర్ఫ్యూ విధిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా అధికారవర్గాల్లో వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్, కోవిడ్ కంట్రోల్ రూమ్ రిపోర్టు, సబ్ కమిటీ సిఫార్సులతో ఏపీలో లాక్ డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూ పై సీఎం జగన్ నిర్ణయం తీసుకునే చాన్సుంది. ఇప్పటికే కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాపారులు, ప్రజలు స్వీయ ఆంక్షలు విధించుకున్నారు. పలు జిల్లాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రజలు లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ ప్రకటన కోసం ఎదురుచూడకుండా భౌతికదూరం పాటించడం, మాస్కు ధరించడంతో పాటు కోవిడ్ మార్గదర్శకాలు ఫాలో అవ్వాలని ప్రభుత్వం చెబుతోంది.