లాక్ డౌన్ : గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.

  • Published By: veegamteam ,Published On : April 20, 2020 / 06:38 AM IST
లాక్ డౌన్  : గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లు

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు. లాక్ డౌన్ కారణంగా మత్స్యకారులు ఏపీకి రాలేని పరిస్థితి నెలకొంది. తమను ఆదుకోవాలని ప్రధాని మోడీ సహా గుజరాత్, ఏపీ సీఎంలకు లేఖ రాశారు. బోటులోనే గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిండిలేక అల్లాడుతున్నామని వాపోయారు.

ఉపాధి లేకపోవడంతో తిండి లేక పొరుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తమను ఎవరూ ఆదుకోవడం లేదన్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిండి లేదని, నిద్ర లేదని వాపోతున్నారు. 15వ శ్రీకాకుళం జిల్లాకు తీసుక నుంచి రెవెన్యూ అధికారులు తమ దగ్గరకు వచ్చారని చెప్పారు. ఒక రోజుకు అవసరమయ్యే సరుకులు ఇచ్చి వెళ్లిపోయారు. 5 కిలోల బియ్యం, కేజీ బంగాలాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, మనిషికి ఒక సబ్సు, మాస్క్ ఇచ్చి వెళ్లిపోయారని చెప్పారు.

ఒక రోజుకు ఇచ్చే సరుకులతో తాము ఎలా ఉండేదని అంటున్నారు. ఒక వేల తమను రాష్ట్రానికి తీసుకెళ్లని ఎడల గుజరాత్ ప్రభుత్వంతో మాట్లాడి, క్వారంటైన్ లో పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారని తెలిపారు. సౌకర్యాలు కల్పించాలని వేడుకుంటున్నారు. తమను ఏపీకి తరలించి క్వారంటైన్ లో పెట్టాలని కోరుతున్నారు.

Also Read | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత