lokesh: ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ

ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లను ప్ర‌స్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత‌ నారా లోకేశ్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఆయ‌న కోరారు.

lokesh: ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh

lokesh: ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లను ప్ర‌స్తావిస్తూ ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత‌ నారా లోకేశ్ లేఖ రాశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ఆయ‌న కోరారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న నిర్మాణ రంగాన్ని, దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్త‌వ్య‌స్తం చేశార‌ని ఆయ‌న అన్నారు. వంద‌లాది మంది భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌కుల‌య్యారని చెప్పారు. అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్ర‌మ‌లకి ప‌వ‌ర్ హాలీడే ప్ర‌క‌టించేలా చేశారని విమ‌ర్శించారు.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల‌ రైతులు పంట‌లు వేయ‌కుండా క్రాప్ హాలీడే పాటిస్తున్నారని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందని, విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్ర‌క‌టించాల‌ని రైతులు తీసుకున్నార‌ని తెలిపారు. ఈ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమ‌ని విమ‌ర్శించారు. ఫీడ్ కేజీకి రూ.20, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర మందుల ధ‌ర‌లు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి ఈ స‌మ‌స్య రాక‌పోవ‌డం విచిత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు.

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..

రొయ్య‌ల రేటు ఏ కౌంటు అయినా కేజీ సుమారు రూ.70 నుంచి రూ.150 వ‌ర‌కూ త‌గ్గినా సీఎం నుంచి స్పంద‌న శూన్యమ‌ని విమ‌ర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు జ‌గ‌న్.. అధికారంలోకి వ‌చ్చాక ఫీడ్-సీడ్ యాక్ట్ తేవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని నారా లోకేశ్ చెప్పారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వా రైతుల‌ను ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన్నారు.

Uttam Kumar Reddy: కేసీఆర్‌కు బీజేపీతో రహస్య ఒప్పందం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీడీపీ గతంలో అన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, జ‌గ‌న్ మాత్రం స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారని ఆయ‌న చెప్పారు. ఆక్వారంగం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నింటినీ వెంట‌నే నెర‌వేర్చ‌క‌పోతే ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ‌రంగ దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చని అన్నారు.