బ్రేకప్ చెప్పిందని.. యువతి న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు

విజయవాడలో దారుణం జరిగింది. ఓ శాడిస్ట్ లవర్ నీచానికి ఒడిగట్టాడు. ప్రియురాలి నగ్న ఫొటోలు, న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందాడు. ఇంతకీ ఆ నీచుడు అలా ఎందుకు చేశాడో

బ్రేకప్ చెప్పిందని.. యువతి న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాడు

Nude Video

విజయవాడలో దారుణం జరిగింది. ఓ శాడిస్ట్ లవర్ నీచానికి ఒడిగట్టాడు. ప్రియురాలి నగ్న ఫొటోలు, న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందాడు. ఇంతకీ ఆ నీచుడు అలా ఎందుకు చేశాడో తెలుసా.. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో.

బీహార్ కు చెందిన రోహిత్ ఉపాధి నిమిత్తం విజయవాడలో నివాసముంటున్నాడు. మూడేళ్లుగా అతడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సదరు యువతి అతడి ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఏ అమ్మాయి చేయని పని తను చేసింది. ప్రియుడు కోరాడని తన నగ్న ఫోటోలు, వీడియోలను అతడికి పంపించింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో యువతి.. రోహిత్ కు బ్రేకప్ చెప్పింది. దీంతో రోహిత్ రగిలిపోయాడు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

రోహిత్ అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. యువతి నగ్న ఫోటోలు, వీడియోలను తన స్నేహితుడు గణేష్ కు పంపాడు. ఇద్దరూ కలిసి ఇన్ స్టాగ్రామ్ లో నకిలీ ఖాతా క్రియేట్ చేసి యువతి ఫోటోలను, వీడియోలను అందులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న యువతి ఇది రోహిత్ పనేనని గుర్తించింది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు రోహిత్ తో పాటు అతడి స్నేహితుడు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి సెల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆ నీచులకు రిమాండ్ విధించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

ఈ రోజుల్లో కాలేజీ స్నేహాలు, ప్రేమలు కామన్ గా మారాయి. కాగా, అలా మొదలైన ప్రేమలు కొన్ని పెళ్లిళ్ల వరకు వెళ్తుండగా.. మరికొన్ని అనర్థాలకు దారితీస్తున్నాయి. దారుణాలు జరిగిపోతున్నాయి. జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.