ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య

ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య

lovers suicide in a lodge nellore district : నెల్లూరునగర శివారు పడారుపల్లి లోని లాడ్జిలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా రూరల్‌ మండలానికి చెందిన హరీష్‌ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. వీరుద్దరూ శుక్రవారం విధులకు హాజరుకాలేదు.

నెల్లూరు నగర శివారు ప్రాంతమైన నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఏ కారణమో స్పష్టంగా తెలియదు కాని ఇద్దరూ కలిసి ఓకే తాడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రయినా హరీష్‌, లావణ్య ఇంటికి రాకపోవడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులకు అర్ధరాత్రి దాటే వరకు ఎలాంటి సమాచారం అందలేదు.

కాగా శనివారం ఉదయం సమాచారం తెలుసుకున్న వేదాయపాళెం పోలీసులు ఉదయం లాడ్జికి వచ్చి మృతదేహాలను పోస్టు మార్టంనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహరామే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

nellore lovers suicide