సిలిండర్ అలర్ట్ : డెలివరీ సమయంలో ఇలా చెక్ చేయండి

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 04:41 AM IST
సిలిండర్ అలర్ట్ : డెలివరీ సమయంలో ఇలా చెక్ చేయండి

హైదరాబాద్ : కొద్ది రోజులుగా గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. బీ అలర్ట్..ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా…ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇంటికి సిలిండర్ రాగానే…ఏమాత్రం చెక్ చేసుకోకుండా వంటగదిలో పెట్టేయడం..వంట చేసేయడం..ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతుంటారు. అయితే..సిలిండర్ బుక్ చేసుకున్న అనంతరం డెలివరీ బాయ్ గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకొని రాగానే చెక్ చేసుకోవాల్సని కొన్ని మెథడ్స్ ఉన్నాయి..

  • ముందుగా గ్యాస్ బరువు చెక్ చేసుకొండి.
  • దాని వెయిట్ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే బరువును చెక్ చేయించండి.
  • దాని ఎక్స్‌పరి డేట్ చెక్ చేసుకోవాలి. ఇది సిలిండర్‌పైనే ఉంటుంది. 
  • సిలిండర్‌పై A, B, C, D అనే అక్షరాలు ఉంటాయి. కదా..ఇవి నెలను సూచిస్తాయి. A అంటే జనవరి – మార్చి. B అంటే ఏప్రిల్ – జూన్ వరకు. C అంటే జూలై – సెప్టెంబర్ వరకు. D అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు.
  • A,B,C,D లేకపోతే నంబర్లు ఉంటాయి. ఉదాహరణకు B 18 అనే సంఖ్య ఉంటే అది జూన్ 2018 వరకు ఉపయోగించవచ్చని సూచిస్తుంది. 
  • గ్యాస్ రెగ్యులర్‌ని సరి చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే మాత్రం గ్యాస్ లీకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
  • సిలిండర్ సీల్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. 
  • గ్యాస్ పైపు, రెగ్యులర్ ఆయా కంపెనీల దగ్గరే తీసుకోవడం బెటర్

    Read More : మీకు తెలుసా : గ్యాసుకూ బీమా