Macherla Government Hospital : బొడ్డు పేగుకు బదులు బిడ్డ వేలు కోసేశారు.. ప్రభుత్వాసుపత్రిలో దారుణం

పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బొడ్డు పేగు కోయబోయి బిడ్డ వేలు కోసేశారు. ప్రసవం కోసం ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. ప్రసవం బాగానే జరిగింది. తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తల్లి స్పృహలో లేదు.

Macherla Government Hospital : బొడ్డు పేగుకు బదులు బిడ్డ వేలు కోసేశారు.. ప్రభుత్వాసుపత్రిలో దారుణం

Macherla Government Hospital : పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బొడ్డు పేగు కోయబోయి బిడ్డ వేలు కోసేశారు. ప్రసవం కోసం ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. ప్రసవం బాగానే జరిగింది. తల్లి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను ప్రసవించిన తల్లి స్పృహలో లేదు.

ఇంతలోనే బొడ్డు పేగు కోయాల్సి రావడంతో అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బందిలో ఒక మహిళ ముందుకొచ్చింది. అయితే ఆమె బొడ్డు పేగు కట్ చేయబోయి అనుకోకుండా బాబు చిటికెన వేలు కోసేసింది. దీంతో షాక్ కు గురైన సిబ్బంది బాబును వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసి చేతులు దులుపుకున్నారు.

మాచర్లకు చెందిన స్వరూప మొదటి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. బిడ్డ బాగానే ఉన్నాడని ఆనందించేలోపే సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఈ ఘటన ఆ కుటుంబాన్ని బాధకు గురి చేసింది. జరిగిన ఘటనపై వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రంగారావు స్పందించారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే ఘటనకు కారణమైన మహిళను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్తాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన వివరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తమకు న్యాయం జరిగే వరకు వదిలేది లేదంటున్నారు బాబు బంధువులు. బాబును గుంటూరు ఆసుపత్రికి రెఫర్ చేశారని, అక్కడికి వెళితే కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి సర్జరీ చేయించామని చెప్పారు బాబు తండ్రి. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే తమతో దురుసుగా మాట్లాడారని, దిక్కున్న చోట చెప్పుకోమన్నారని బాబు తండ్రి వాపోయారు.

”మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నా భార్య డెలివరీ అయ్యింది. అబ్బాయి పుట్టాడు. బాబు బొడ్డు పేగు కట్ చేయబోయి చిటికెన వేలు కట్ చేశారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి వెళితే రాత్రి 10 గంటల వరకు వారు పట్టించుకోలేదు. ఇన్ ఫెక్షన్ అవుతుందనే భయంతో మేము ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాం. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అడిగితే వారు సమాధానం చెప్పలేదు. దిక్కున చోట చెప్పుకోమన్నారు. వేలు కట్ చేసిన విషయం కూడా మాకు చెప్పలేదు. పైన తెగింది, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కుట్టు వేస్తారని చెప్పారు. అక్కడికి వెళ్లాక చూస్తే వేలు సగం కట్ అయి ఉంది. ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. వేలు సగం పోయింది. మిగతా వేలుకి కుట్లు వేసి పంపేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ కోసం మాకు చాలా ఖర్చు అయ్యింది. మాకు న్యాయం కావాలి” అని బాబు తండ్రి డిమాండ్ చేశాడు.