మదనపల్లి డబులు మర్డర్ : పురుషోత్తం తరపున వాదించేందుకు ముందుకొచ్చిన లాయర్, ఎవరాయన ?

మదనపల్లి డబులు మర్డర్ : పురుషోత్తం తరపున వాదించేందుకు ముందుకొచ్చిన లాయర్, ఎవరాయన ?

Madanapalle Double Murder Case : చిత్తూరు మదనపల్లి డబుల్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్టు గాకుండా..పూటకో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారమంతా..కోర్టు మెట్లు ఎక్కబోతోంది. మితిమీరిన భక్తి, మూఢ నమ్మకాలతో సొంత బిడ్డలను చంపుకున్న నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచార్య ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మర్డర్ కేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న పురుషోత్తం నాయుడు తరపున వాదించాలని పూర్వ విద్యార్థులు ఫోన్ లో న్యాయవాదిని సంప్రదించారు. అనంతరం వాదించేందుకు ఆయన ఒకే చెప్పారు. మదనపల్లి డబుల్ మర్డర్ కు సంబంధించిన కేసు వివరాలను ఇప్పటికే సేకరించినట్లు సమాచారం.

పీవీ కృష్ణమాచార్య విషయానికి వస్తే.. ఈయన హైదరాబాద్ లో స్థిరపడ్డారు. సుప్రీంకోర్టులో అనేక సంచనాల కేసులు వాదించారు. ప్రధానంగా..సంచలనం సృష్టించిన దిశ ఎన్ కౌంటర్ కేసుకు వ్యతిరేకంగా..వాదిస్తున్నారు. మరణించిన నిందితుల కుటుంబాలకు అనుకూలంగా ఆయన వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన విషయాలు పూర్వ విద్యార్థులు చెప్పారని, తనకు ఇంట్రెస్ట్ అనిపించి…వారికి న్యాయం చేసేందుకు కేసును టేకప్ చేసినట్లు కృష్ణమాచార్య చెప్పారు.

వారి మానసికస్థితి సరిగ్గా లేదని, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా ఆయన వెల్లడించారు. అంతేగాకుండా..వారు ఉన్నతమైన చదువులు చదువుకున్నారని, చాలామందికి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తులన్నారు. వారు ఏ పరిస్థితులు ఈ దారుణానికి ఒడిగట్టారు ? వారి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు ? ఎవరు చేయించారు ? లేక వారే చేశారా ? ఇంకెవరైనా చేశారా ? అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు. ఇద్దరు నిందితుల తరపున వాదించబోతున్నట్లు న్యాయవాది కృష్ణమాచార్య వెల్లడించారు.

తండ్రి పురుషోత్తమ్ నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతోనే ఇద్దరు కూతుళ్లనూ దారుణంగా హతమార్చారని మొదట అంతా భావించారు. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టు తర్వాత…ఈ అభిప్రాయం మారింది. పెద్ద కుమార్తె అలేఖ్య వల్లే ఈ దారుణం జరిగిందన్న భావన కలుగుతోంది. భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో తాంత్రిక పూజలకు ఆకర్షితురాలైన అలేఖ్య తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఆ మూఢనమ్మకాల వైపు నడిపించినట్టు తెలుస్తోంది. భోపాల్ దగ్గరలోని అటవీ ప్రాంతాల్లో అధికంగా సంచరించే తాంత్రిక మాయగాళ్ల వలలో అలేఖ్య పడినట్టు భావిస్తున్నారు. వారిని తరుచుగా కలుస్తూ తాంత్రిక విద్య పట్ల అలేఖ్య ఆకర్షితురాలైంది.

అక్క నమ్మకాలు, చెల్లి భయాలు…తల్లిదండ్రుల విచిత్ర మానసిక పరిస్థితి…హత్యలకు నేపథ్యంగా నిలిచాయి. తాయత్తులు, ప్రత్యేక పూజలతో సాయిదివ్య భయం తొలగిపోలేదు. కుక్కపై పునర్జన్మ ప్రయోగం చేశానని, దాన్ని చంపి, బతికించానని అలేఖ్య పదే పదే చెప్పడంతో కుటుంబ సభ్యులు నిజమని నమ్మారు. శివుడు తన రూపంలో వస్తున్నాడని, కలియుగంలో చనిపోయి, సత్యలోకంలో పుట్టాలని అలేఖ్య చెప్పే మాటలపై వారికి గురి కుదిరింది. తర్వాత అనర్ధం జరిగిపోయింది.
మొత్తంగా తాంత్రిక విద్యపై అలేఖ్య పిచ్చినమ్మకం తీర్చలేని నష్టానికి కారణమైందన్న ప్రచారం జరుగుతోంది.