Madanapalle అలేఖ్య, సాయిదివ్యల చిన్ననాటి ఫోటోలు వైరల్ : చెల్లెలంటే ప్రాణం..మరి అంత దారుణంగా ఎలా చంపిందో..! అంతుపట్టని మిస్టరీలు

Madanapalle అలేఖ్య, సాయిదివ్యల చిన్ననాటి ఫోటోలు వైరల్ : చెల్లెలంటే ప్రాణం..మరి అంత దారుణంగా ఎలా చంపిందో..! అంతుపట్టని మిస్టరీలు

Madanapalle Double Murders : మదనపల్లె జంట హత్యల కేసు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలకలం రేపిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ కేసులో ఎన్నో మిస్టరీలు..ఎన్నెన్నో ట్విస్టులు. ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమ నాయుడు, పద్మజ ముద్దుల కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నవారి కూతుళ్ల ఘోరాతి ఘోరమైన చావులకు కారణమయ్యారు. అత్యంత మూఢత్వంతో చిన్నకూతుర్ని పెద్ద కూతురు అలేఖ్య చంపేసాక.. పెద్ద కూతుర్ని తల్లి పద్మజ స్వహస్తాలతో అత్యంత కిరాతకంగా హత్య చేసింది.

ఇద్దరూ కూతుళ్లే అయినా ఎంతో గారాబంగా చూసుకున్న చేతులతోనే అంతమొందిచిన ఈ రెండు హత్యల వెనుక ఎన్నో మిస్టరీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో అలేఖ్య, సాయి దివ్యల చిన్ననాటి ఫోటోలు వైరల్ గా మారాయి. చెల్లెలు సాయి దివ్య అంటే అలేఖ్యకు ప్రాణం. అలాగే ఇద్దరు కూతుళ్లంటే పురుషోత్తం, పద్మజలకు ఆరోప్రాణం. కానీ ఏం లాభం..మగపిల్లలు లేరనే ఆలోచనే లేకుండా ఇద్దరు ఆడపిల్లలకు కోరింది ఇచ్చేవారు.భరతనాట్యం నేర్పించారు. కరాటే నేర్పించారు. అలేఖ్య సాయిదివ్యలు చక్కగా బొమ్మలు కూడా వేస్తారు. ఇన్ని ప్రత్యేకలు ఉన్నవీరి కటుంబంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే అంతులేని మూఢత్వం..అదే వారి కుటుంబాన్ని ఛిన్నా భిన్నం చేసింది. అదే మూఢత్వం అపురూపంగా పెంచుకున్న కూతుళ్ల ప్రాణాలు తీసింది..!!

మూఢనమ్మకాలకు బలైపోయిన అలేఖ్య సోషల్ మీడియా ఖాతాలో వారి చిన్నప్పటి ఫొటోలు వైరల్ గా మారాయి. చెల్లి సాయి దివ్యతో కలిసి తాను దిగిన ఫొటోలను అలేఖ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది. చెల్లెలంటే అలేఖ్యకు ఎంత ఇష్టమో ఈ ఫోటోల్ని చూస్తే తెలుస్తుంది.

అలేఖ్య మరణానంతరం ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఆమె గతంలో ఏమేం పోస్టులు చేసింది? ఎటువంటివాటిని ఎక్కువగా నమ్మేది. ఎటువంటి పోస్టులు పెట్టింది? ఏమేమి రాసింది? వంటివాటిపై నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఉన్నత విద్యావంతులైన పురుషోత్తమనాయుడు, పద్మజలకు మూఢనమ్మకాలు బాగా ఎక్కువ అని మాత్రమే తెలుసు. కానీ కూతుళ్లు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి భరతనాట్యం, కరాటే వంటి వాటిని నేర్పించారని అలేఖ్య సోషల్ మీడియా ఖాతాలోని పోస్టుల ద్వారా తెలుస్తోంది.

ప్రతీ సంవత్సరం పురుషోత్తం, పద్మజలు తమ కూతుళ్ల పుట్టిన రోజు వేడుకల్ని ఎంతో సంబరంగా జరిపేవారు. ప్రత్యేక గిఫ్టులు కొనిచ్చేవారు. కూతుళ్ల పుట్టిన రోజును ఓ పండుగలా నిర్వహించేవారనీ..బంధువుల్ని, స్నేహితుల్ని ఇంటికి పిలిచి ఆడంబరంగా వేడుక చేసేవారని వారి స్నేహితులు..సన్నిహితులు చెబుతున్నారు.

తమకు ఇద్దరూ కూతుళ్లే అయినా, కొడుకులేరని వాళ్లు ఎప్పుడూ అస్సలు ఆలోచించలేదని బంధువులు చెబుతున్నారు. కూతుళ్లే తమకు సర్వస్వంగా బతికారనీ..కానీ వారికి ఇంతటి మూఢనమ్మకాలు ఎలా అలవాటయ్యాయో తెలీలేదనీ..చాలా తక్కువ మయంలోనే వారు మూఢనమ్మకాలను ఎందుకు, ఎలా నమ్మారో..? అర్థం కావట్లేదన్నారు. ఎవరో వారిని బాగా ప్రభావితం చేశారని బంధువులు వాపోతున్నారు. ఏదో బలమైన కారణంతో వారిని మూఢనమ్మకాల వైపు నడిపించి ఉంటారని అంటున్నారు.

 

అలేఖ్య, సాయి దివ్య లు అక్కా చెల్లెళ్లులా కాకుండా..క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారని ఒకరినొకరు చదువులో సహకరించుకుంటూ ప్రోత్సహించుకునేవారని వారి ఫ్రెండ్స్ చెబుతున్నారు. అలేఖ్య తమకు ఎప్పుడూ చక్కటి విషయాలను చెప్పేదని చాలా మంచిగా ఉండేదని గుర్తు చేస్తున్నారు.

అలేఖ్య, సాయి దివ్యలు అప్పుడప్పుడూ టూర్లకు వెళ్లేవారని..ప్రకృతి అంటే వారికి చాలా ఇష్టం..అందుకే ఎక్కువగా ప్రకృతిలో గడపడాన్ని ఇష్టపడేవారని తెలిపారు. ఏదిఏమైనా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నవారిద్దరూ ఇలా చిన్నతనంలోనే మూఢనమ్మకాలకు బలికావడం చాలా విచారించాల్సిన విషమని అంటున్నారు. ఈ దారుణాలకు నిజంగా వారి తల్లిదండ్రులే కారణమైతే వారిని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే వారిని ఇలా మూఢనమ్మకాల దిశగా ప్రభావితం చేశారో వారిని కూడా శిక్షించాలని కోరుతున్నారు.