కూతుళ్లను తల్లిదండ్రులే చంపారని పోలీసుల నిర్ధారణ

కూతుళ్లను తల్లిదండ్రులే చంపారని పోలీసుల నిర్ధారణ

Madanapalle sisters’ murder case is under investigation : మదనపల్లి అక్కాచెల్లెళ్ల దారుణ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. వారం రోజుల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలేఖ్య, సాయిదివ్యలను తల్లిదండ్రులు పురుషోత్తమ్ నాయుడు, పద్మజే చంపారని, మూడో వ్యక్తి ప్రమేయం లేదని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం పురుషోత్తమ్, పద్మజ మదనపల్లి సబ్‌ జైలులో ఉన్నారు. నిన్న వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వారిద్దరూ ….డెల్యూషన్స్‌ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు భావిస్తున్నారు. వారిని మానసిక చికిత్సకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరే అవకాశం ఉంది. ఇద్దరినీ తిరుపతి రుయా ఆస్పత్రి సైక్రియాట్రిక్ విభాగానికి తరలించే ఆలోచనలో మదనపల్లి పోలీసులు ఉన్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల ఘటన సంచలనం సృష్టిస్తోంది. మళ్లీ పుడతారనే మూడనమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్య చేశారు. శివనగర్‌లో నివాసం ఉండే ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ వల్లేరు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలను హత్య చేశారు.
జంట హత్యల కేసులో బైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తల్లిదండ్రులనిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు.

ఈ విచారణలో నిందితులిద్దరు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. మా ఇంట్లో దేవుళ్లున్నారనీ..మా కూతుళ్లని ఆ దేవుళ్లు బతికిస్తారనీ..గతంలో కూడా మా ఇంట్లో ఎన్నో మహిమలు జరిగాయనీ చెప్పుకొస్తున్నారు. మా ఇంట్లో గత కొన్ని రోజులుగా పూజలు చేస్తున్నామని..పూజల కోసం 10 రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా ఎంతో భక్తితో పూజలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.