మహాశివరాత్రి.. శైవ క్షేత్రాలు ముస్తాబు

ఓం నమః శివాయ... అన్నంతనే చాలు... అన్ని పాపాలు తొలగిపోతాయంటారు... ముక్కంటీ... భోళా శంకరుడు.... ఈశ్వరుడు... శివుడు... ఇలా పేరు ఏదైనా సరే... భక్తుల కోరికలు తీర్చే పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి.

మహాశివరాత్రి.. శైవ క్షేత్రాలు ముస్తాబు

Mahashivaratri festival : ఓం నమః శివాయ… అన్నంతనే చాలు… అన్ని పాపాలు తొలగిపోతాయంటారు… ముక్కంటీ… భోళా శంకరుడు…. ఈశ్వరుడు… శివుడు… ఇలా పేరు ఏదైనా సరే… భక్తుల కోరికలు తీర్చే పరమేశ్వరుడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఈశ్వర కాటాక్షం కోసం బారులు తీరారు.

పేరు ఏదైనా… పిలిచిన వెంటనే భక్తులను ఆదుకునే దేవుడు శివయ్య… వరాలివ్వడంలో భోళా శంకరుడు. చిటికెడు బూడిద, చెంబుడు నీళ్లు పోస్తే చాలు… కరుణిస్తాడనేది భక్తుల విశ్వాసం. ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. శివరాత్రి సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జాము నుంచే భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తున్నారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి… జాగరణ ఉండాలనే వారు తప్పని సరిగా ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకుంటారు. పురాణాల్లో ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు, ఇతిహాసాలు ప్రాచూర్యంలో ఉన్నాయి. క్షీర సాగర మదన సమయంలో ఒక విషకుంభం సముద్రం నుండి ఉద్భవించింది. ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు, రాక్షసులు భయభ్రాంతులవుతున్న సమయంలో… ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు హలాహలం సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులో ఉంచుకోనేను. దాంతో ఆయన గొంతు నీలంగా మారింది. నీలవర్ణము కంఠం వలన ఆయనను నీలకంఠ అని పిలుస్తారు. శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంలో ఈ శివరాత్రి వేడుకను జరుపుకుంటున్నారు.

ఫాల్గుణ మాసంలో 14 వ రోజు కృష్ణ పక్షం రోజున శివుడు స్వయంగా శివలింగం రూపంలో ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రత్యేకంగా పవిత్రమైన మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజు శివున్ని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహా శివరాత్రి నాడు భక్తులు ఉపవాసం ఉండి… రాత్రంతా జాగరణ చేస్తారు. ఉదయమే పుణ్యస్నానాలు ఆచరించి… శివునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు.

శివుని రూపానికి పూజలు ఉండవు. శివలింగానికి మాత్రమే ఉంటాయి. లింగపూజ ఎంతో భక్తిగా, విశేషంగా ప్రతిరోజూ నిర్వహిస్తారు. శివుడే మంగళాన్ని కలిగిస్తాడని, శాంతిని పెంచుతాడని, వైవాహిక సౌఖ్యాన్ని అందిస్తాడని, ఆరోగ్యప్రదుడని, అకాల మృత్యువును దరి చేరనీయడని, సకల ఐశ్వర్యాలనూ అందిస్తాడని ఇలా ఎన్నో భావనలతో భక్తులు పూజిస్తుంటారు.

శివపూజలో శివలింగంపై బిల్వదళాలు, తులసీదళాలు పెట్టి పూజించే సంప్రదాయం ఉంది. ఆ వృక్షాలు అధికమైన చోట కాలుష్యాలన్నీ నియంత్రితమై ఆనందంగా అందరూ జీవిస్తారని… ఈ విధంగా ప్రతీకలుగా ఉన్న అంశాలను పూజా విధానంలో చేర్చి చూపే సంప్రదాయం భారతీయులకు మాత్రమే ఉంది. తమకు ఎన్నో రూపాల్లో సంతోషాన్నిచ్చే ఈ భూమి పుట్టిన కాలాన్నే లింగోద్భవ కాలంగా గుర్తించి, ఆ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటారు. లోకానికి మరింత మేలు, మానవాళికి మరింతగా ఆనందం కలగాలని, కోరుకుంటూ చేయాల్సిన కృతజ్ఞతా సంబంధ పూజా విధానాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే, లింగోద్భవ కాలంలో భూగోళరూప శివయ్యని మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం.