#MahaShivratri2023: కన్నుల పండువగా రథోత్సవం

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, శ్రీ బ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ గంగా‌ పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా మూడు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి విజయవాడలోని కెనాల్ రోడ్డులో రథోత్సవం నిర్వహించారు.

#MahaShivratri2023: కన్నుల పండువగా రథోత్సవం

#MahaShivratri2023

#MahaShivratri2023: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, శ్రీ బ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ గంగా‌ పార్వతి సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివరాత్రి సందర్భంగా మూడు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి విజయవాడలోని కెనాల్ రోడ్డులో రథోత్సవం నిర్వహించారు.

ఈ రథోత్సవాన్ని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు ప్రారంభించారు. రథాలపై ఆశీనులైన స్వామి వార్లను దర్శించి భక్తజనం భక్తి పారవశ్యంలోమునిగిపోయారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మూడు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తులను తీసుకువచ్చి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు.

రథోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. స్వామి వార్ల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. స్వామి వార్ల ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని కోరుకున్నానని చెప్పారు.

CCL 2023 : కేరళ పై తెలుగు వారియర్స్ విక్టరీ.. అఖిల్ అక్కినేని స్కోర్ ఎంతో తెలుసా?