Accident : పోలీస్ వ్యాన్‌కు యాక్సిడెంట్.. సీఐ దుర్మరణం

విశాఖలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎండాడ వద్ద గురువారం తెల్లవారుజామున పోలీస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కారణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి

10TV Telugu News

Accident :  విశాఖలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఎండాడ వద్ద గురువారం తెల్లవారుజామున పోలీస్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో త్రీ టౌన్ సీఐ కారణం ఈశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనలో కానిస్టేబుల్‌ సంతోష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న సీఐ ఈశ్వరరావు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం తరలించారు… చికిత్స నిమిత్తం సంతోష్‌ను ఆసుపత్రిలో చేర్చారు.

చదవండి : Road Accident :  లారీని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు

పోలీస్ వ్యాన్‌ను ఢీకొట్టి పరారయ్యారు.. వాహనం గుర్తించేందుకు ఘటనాస్థలికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రాంతం గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతుంటుంది.. అక్రమార్కులెవరైనా ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక నగర కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే రేవళ్లపాలెంలోని సీఐ భార్య కుటుంబ సభ్యులను సీపీ పరామర్శించారు.

చదవండి : Accident : షాకింగ్ యాక్సిడెంట్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇప్పటివరకు చూసి ఉండరు..