ఐదోతరగతి బాలికపై ఇంట్లో మేనమామ అత్యాచారం

నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 07:24 PM IST
ఐదోతరగతి బాలికపై ఇంట్లో మేనమామ అత్యాచారం

నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి

నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలు, బాలికలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. మానవ మృగాల్లో మార్పు లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి కాటేస్తున్నారు. వీధిలోనే కాదు.. ఇంట్లో కూడా ఆడపిల్లకు రక్షణ లేదు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మేనమామే.. దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై వరుసకు మేనమామ అయిన బంధువు(30) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని వడ్లూరులో జరిగింది. 

ఇంట్లో ఒంటరిగా బాలిక:
మండలంలోని వడ్లూర్‌ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన వ్యక్తి రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. భార్య స్పిన్నింగ్‌ మిల్లులో పని చేస్తుంది. వీరికి 11 ఏళ్ల కూతురు ఉంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. బాలిక సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుంది. తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్తారు. దీంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇది గమనించిన వివాహితుడైన బాలిక సమీప బంధువు వరుసకు మేనమామ.. బాలికపై కన్నేశాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో లైంగికదాడికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. 

నిందితుడిని పట్టించిన ఫోన్ కాల్:
జరిగిన విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించాడు నిందితుడు. భయపడిన బాలిక విషయాన్ని గోప్యంగా ఉంచింది. కాగా, లైంగిక దాడి తర్వాత రోజు నుంచి.. నిందితుడు.. బాలిక తల్లిదండ్రులకు తరుచుగా ఫోన్‌ చేసి బాలిక గురించి ఆరా తీస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి బాలికను నిలదీశారు. తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు బాలికతో నిందితుడికి ఫోన్‌ చేయించి అసలు విషయాన్ని రాబట్టి ఫోన్‌లో నిందితుడి వాయిస్‌ను రికార్డ్‌ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దిశ యాక్ట్‌ స్ఫూర్తిగా తీసుకుని వారం రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

See Also>>8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం: ఛిధ్రమైపోయిన బిడ్డను చూసి తల్లి వేదన

ఆడపిల్లకు భద్రతేది?
వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి.. ఈ దారుణానికి ఒడిగట్టడం బాలిక తల్లిదండ్రులను షాక్ కి గురి చేసింది. వీధుల్లోనే కాదు ఇంట్లోనూ ఆడపిల్లకు రక్షణ కరువైంది. ఇక ఆడపిల్లకు భద్రత ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఆడపిల్ల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.