Young Woman : స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిపై అత్యాచారం, ఎస్ఐ పేరుతో దురాఘతం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఉరి వేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.

Young Woman : స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిపై అత్యాచారం, ఎస్ఐ పేరుతో దురాఘతం

Young Woman

Young Woman : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా, ఉరి వేస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. అమ్మాయిలకు రక్షణ లేదు. నిత్యం ఎక్కడో చోట అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మృగాడు దాడి చేస్తాడో తెలియని దుస్థితి. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. స్నేహితుడి కలిసి బయటకు వెళ్లిన యువతిపై కన్నేసిన ఓ నీచుడు.. ఎస్ఐ పేరుతో ఆమెను బెదిరించి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. ఇది గమనించిన ఓ అగంతుకుడు బైక్ పై వారిని ఫాలో అయ్యాడు. ఆ తర్వాత యువతి ఒంటరిగా కనిపించింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లిన అతడు ఆమెకు సంబంధించిన వీడియోలు తన దగ్గర ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపిస్తానని బెదిరించాడు. అయితే, తానేమీ తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా బదులివ్వడంతో అతను షాక్ తిన్నాడు. తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదనుకున్నాడు.

ఒక్కసారిగా అతడు మాట మార్చాడు. ఈసారి పోలీసుల గురించి ప్రస్తావించాడు. ఎస్ఐ పిలుస్తున్నారు.. స్టేషన్‌కు రావాలని అన్నాడు. పోలీసుల పేరు చెప్పడంతో యువతి భయపడింది. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో అతడి బండి ఎక్కింది. యువతిని కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన తర్వాత ఆమెను బెదిరించాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత బాధితురాలిని అక్కడే వదిలేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పి ఆ యువతి చెప్పి కన్నీటి పర్యంతమైంది. వాళ్లు ఆమెకు ధైర్యం చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేలా స్థైర్యం కల్పించారు. పోలీసుల పేరుతో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడి ఉదంతంపై బాధితురాలు గురువారం(మే 27,2021) రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్మాయిలను భయాందోళనకు గురి చేసింది. ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని ఓ అగంతుకుడు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. తనకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపుతానంటూ బెదిరించాడు.