మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు

మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు

Manipulations in the MPTC and ZPTC elections says sec nimmagadda
గత ఏడాది మార్చిలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. అప్పుడు జరిగిన ఏకగ్రీవాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అప్పటి తప్పులు ఇప్పుడు రిపీట్ కాకుండా ఉండేందుకు పక్కా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికలపై అన్ని జిల్లాల్లో పర్యటించినట్లు చెప్పిన ఆయన… ఎన్నికలు ఆపడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికలను వ్యతిరేకించే శక్తులు ఇప్పటికైనా మారాలని సూచించారు. మనకంటే గ్రామస్తులే కలసి మెలసి ఉన్నారన్నారు. ఏకగ్రీవాలు కాకపోతే గ్రామ వాతావరణం కలుషితమవుతుందన్న వాదనను తాను అంగీకరించబోనన్నారు.

మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయన్న నిమ్మగడ్డ.. ఎన్నికల నిర్వహనలో తనకు రాజ్యాంగం అపారమైన అధికారాలు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పును తాను కచ్చితంగా పాటిస్తానని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.