Visakha Girl Death : విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు

విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు బాలిక బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేక ఎవరైనా తోసేసి చంపారా? అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Visakha Girl Death : విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు

Girl Dead (1)

Many suspicions in the death of a girl : విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు బాలిక బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేక ఎవరైనా తోసేసి చంపారా? అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. తమ పాప శరీరంపై పెనుగులాడిన గుర్తులు ఉన్నాయని.. బిల్డింగ్‌పై కూడా ఈడ్చుకెళ్లిన గుర్తులున్నాయని చెబుతుండటంతో అసలు నిన్న రాత్రి పాప ఇంటి నుంచి వెళ్లినప్పటి నుంచి ఏం జరిగిందన్న దానిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

పక్కా ప్లాన్ ప్రకారమే తమ పాపను హత్య చేశారంటున్నారు బాలిక చిన్నాన్న రామారావు.. బాలిక రాత్రి నుంచి కనిపించలేదని.. అప్పటి నుంచి పాప కోసం వెతికామన్నారు.. పక్క బిల్డింగ్‌ పైకి ఎక్కి చూస్తే పాప మృతదేహం కనిపించిందని తెలిపారు.. కానీ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరన్నారు.. తమ పాప ఎలా చనిపోయిందన్నది తేలాలని డిమాండ్‌ చేశారు..

Suspicious Death : విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

మరోవైపు ఈ కేసులో ఆదిత్య నివాస్‌లో ఉంటున్న ఓ ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. వీరికి ఈ హత్యకు సంబంధం ఉందా? ఈ హత్యకు ఆ యువకులే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు..

అయితే బాలిక అపార్ట్‌మెంట్‌ పై నుంచి పడి మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.. పై నుండి పడటంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో పాటు కాలు విరిగినట్టు గుర్తించారు.. బాలిక మృతి చెందిన అపార్ట్‌మెంట్‌లో మేనమాన వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.. అయితే బాలిక అక్కడికి ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం జరిగింది? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

ప్లాన్‌ ప్రకారమే హత్య చంపేశారంటున్న బాలిక చిన్నాన్నగాజువాకలో జరిగిన బాలిక మృతి ఘటనపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్‌ ప్రకారమే బాలికను చంపేశారని ఆరోపిస్తున్నారు. ఐదో అంతస్థు పైనుంచి బాలిక పడిపోయివుంటే.. శరీరంపై పెద్దగా గాయలు కాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఆ భవనంపై పెనుగులాట జరిగిన ఆనవాళ్లు కూడా ఉన్నాయంటున్నారు.