High alert : మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు..AOBలో హై అలర్ట్.!

మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర – ఒడిశా బోర్డర్)లో హై అలర్ట్ ప్రకటించారు.

10TV Telugu News

Maoist Martyrs’ Week..AOB disha Border High alert : మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర – ఒడిశా బోర్డర్)లో హై అలర్ట్ ప్రకటించారు. రంగంలోకి అదనపు పోలీస్ బలగాలు.. విశాఖ ఏజెన్సీలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో గిరిజనులను మిలీషియా హతమార్చే అవకాశముందని భావిస్తున్న పోలీస్ అధికారులు ఆ దిశగా అప్రమత్తమయ్యారు.

మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో ఛ‌త్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీసులు మావోల కోసం భద్రతాబలగాలు జల్లెడపడుతున్నారు. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కు చెందిన రెండు బెటాలియన్లు, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మళ్లీ తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లుగా సమాచారం.

10TV Telugu News