Margani Bharat: ఈ విషయం గ్రహించారు.. అందుకే జూ. ఎన్టీఆర్ మహానాడుకు దూరంగా ఉన్నారు: ఎంపీ మార్గాని భరత్

చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు.

Margani Bharat: ఈ విషయం గ్రహించారు.. అందుకే జూ. ఎన్టీఆర్ మహానాడుకు దూరంగా ఉన్నారు: ఎంపీ మార్గాని భరత్

Margani Bharat

Margani Bharat- TDP Mahanadu: టీడీపీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. తాతకి వెన్నుపోటు పొడిచారని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ పార్టీని లాక్కున్నారని, బ్యాంక్ అకౌంట్స్ కూడా లాక్కున్నారని అన్నారు.

చంద్రబాబును సీనియర్ ఎన్టీఆర్.. గాడ్సేతో పోల్చారని మార్గాని భరత్ తెలిపారు. లోకేశ్ కు పట్టం కట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వాస్తవమా? కాదా? అని అడిగారు. టీడీపీకి ఇది మహానాడు కాదని, రాజకీయంగా చివరినాడు కాబోతోందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు, లోకేశ్ ఉండేది హైదరాబాద్ లో, రాజకీయం చేసేది ఏపీలో అని మార్గాని భరత్ విమర్శించారు. టీడీపీది పెత్తందారి వ్యవస్థ అని, తమది మాత్రం పేదల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి రూ.1200 కోట్లు ఖర్చు చేసి, విలాసవంతంగా జీవిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటం దేనికి? శత జయంతి ఉత్సవాలు జరపడం దేనికి? అని అన్నారు.

చంద్రబాబు, లోకేశ్ వల్ల ఏపీ ప్రతిష్ఠ కేంద్రం వద్ద దిగజారిందని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని లేఖలు రాస్తున్న ఎంపీ రఘురామ కృష్ణ రాజుకి మహిళలు బుద్ధి చెబుతారని అన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పాల్గొన్నారని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పార్లమెంట్ భవన నిర్మాణం ఉందని తెలిపారు.

TDP Mahanadu 2023: మహానాడు ప్రాంగణంలో గాలి వాన బీభత్సం.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన చంద్రబాబు కాన్వాయ్