Suicide In Police Station : విశాఖ పోలీస్ స్టేషన్‌లో వివాహిత ఆత్మహత్య కలకలం.. పోలీసుల ముందే అఘాయిత్యం, 6నెలల క్రితమే పెళ్లి

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రావణి అనే యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Suicide In Police Station : విశాఖ పోలీస్ స్టేషన్‌లో వివాహిత ఆత్మహత్య కలకలం.. పోలీసుల ముందే అఘాయిత్యం, 6నెలల క్రితమే పెళ్లి

Suicide In Police Station : విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన శ్రావణి అనే యువతి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో శ్రావణి దంపతులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా, బయటకు వచ్చిన శ్రావణి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. దీంతో శ్రావణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడబోయిన ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. పోలీస్ స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

6 నెలల క్రితమే శ్రావణి, వినయ్ ల పెళ్లి జరిగింది. శ్రావణి వినయ్ ను రెండో వివాహం చేసుకుంది. పెళ్లి అయినప్పటి నుంచి తరుచుగా ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. తను మొదటి భార్య వద్దకు వెళ్లిపోతానని వినయ్ అనేవాడు. దీంతో శ్రావణి భర్త వినయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంతలో పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి శ్రావణి కిందకు వచ్చేసింది. శ్రావణి బాటిల్ లో తన వెంట పెట్రోల్, అగ్గిపెట్టె కూడా తెచ్చుకుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చిన వెంటనే పెట్రోల్ తనపై పోసుకుని నిప్పంటించుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేతికి మంటలు అంటుకుని గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

శ్రావణి లా సెకండియర్ చదువుతోంది. వినయ్ కూడా లా ఫోర్త్ ఇయర్ చదువుతున్నాడు. ఆరు నెలల క్రితమే వీరి పెళ్లి జరిగింది. నెల రోజులు సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు విడాకులు కావాలని శ్రావణి కోరుతోంది. దీంతో ఇది కోర్టు వ్యవహారం అని, కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు శ్రావణి దంపతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇంతలో విసిగిపోయిన శ్రావణి.. పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తుండగానే.. కిందకు వచ్చేసి అఘాయిత్యానికి ఒడిగట్టింది. తీవ్రంగా గాయపడ్డ శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. శ్రావణి తన వెంట తెచ్చుకున్న బ్యాగ్ లోనే పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె కూడా తెచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. లేడీస్ బ్యాగ్ కావడంతో పోలీసులు ఆ బ్యాగ్ ను చెక్ చేయలేదు.