Corona Deaths : ఏపీలో కరోనా మరణ మృదంగం..స్మశాన వాటికల్లో గుట్టలుగా మృతదేహాలు

ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవడంతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది.

Corona Deaths : ఏపీలో కరోనా మరణ మృదంగం..స్మశాన వాటికల్లో గుట్టలుగా మృతదేహాలు

Massive Corona Deaths In Ap

Massive corona deaths in AP : ఏపీలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. కేసులు భారీగా నమోదవడంతోపాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల నుంచి సరైన సమాచారాన్ని స్వీకరించలేకవడంతో వివరాలు తెలియక మృతదేహాలు మార్చిరీలోనే ఉండిపోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్‌లో మృతదేహాలతో మార్చిరీలు నిండిపోతున్నాయి.

కరోనాతో ఏపీలో మరణమృదంగం మోగుతోంది. కృష్ణా జిల్లాలో కోవిడ్ -19 కరాళ నృత్యంతో రోజుకు 30 నుంచి 40 మంది మృత్యువాత పడుతున్నారు. దీంతో మృతదేహాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. రోగుల నుంచి సరైన సమాచారాన్ని సేకరించలేని పరిస్థితిలో వైద్య సిబ్బంది ఉండటంతో రోజుల తరబడి డెడ్‌బాడీలు అందులోనే ఉండిపోతున్నాయి.

కోవిడ్ -19తో మృతి చెందినవారి బంధువులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని మార్చిరీలోకి తరలిస్తున్నారు. అయితే రోగి వివరాలు చెప్పకుండా దాయడంతో కూడా ఈ ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. అయితే మృతదేహాలను అప్పగించడంతో ఆలస్యం అవడంతో మృతుల కుటుంబ సభ్యులు గొడవకు దిగుతున్నారు.

గతంలో విజయవాడ వన్ టౌన్‌కు చెందిన ఓ వృద్దురాలు తన భర్తకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేర్చింది. ఐదు రోజులు గడిచిన తర్వాత భర్త బాగోగులు తెలుసుకునేందుకు హాస్పిటల్‌కు వెళ్లితే…తాము అడ్మిట్ చేసుకోలేదని బుకాయించారు వైద్య సిబ్బంది. మీడియా… సహాయంతో ఆసుపత్రిలో జాయిన్ చేసిన సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తే….అసలు విషయం తెలిసింది. వృద్దుడిని ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు కన్ఫామ్ అవడంతో వైద్య సిబ్బంది నీళ్లు నమిలారు.

అయితే ఇక్కడ మరో ట్వీస్ట్ ఏంటంటే… చికిత్సకు భయపడి వృద్దుడు పారిపోయాడంటూ హాస్పిటల్ సిబ్బంది బుకాయించారు. మరోసారి మీడియా జోక్యం చేసుకుని విషయాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్లితే…. చివరకు మృతదేహం మార్చిరీలో ఉంది. ఇలా చాలా ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో కడసారి చూపుకూడా దక్కని స్థితిలో మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఓ పక్క కోవిడ్‌తో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే పరిశుభ్రంగా ఉండాల్సిన హాస్పిటల్స్‌ అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీంతో రోగం తగ్గడం ఏమోగానీ మరింత ముదిరేలా ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కరోనాతో ప్రాణాలు విడిచిన వారి మృతదేహాలతో స్మశాన వాటికలు నిండిపోతున్నాయి. అంత్యక్రియల కోసం స్మశానాల దగ్గర రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కరోనాకు ట్రీట్‌మెంట్‌ మాత్రమే కాదు… మరణిస్తే ఆరడుగుల స్థలం కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.