Tirumala Fire Break : తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.

Tirumala Fire Break : తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

Massive Fire Breaks Out In Tirumala

Massive Fire accident in Tirumala  : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. గమనించిన టీటీడీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెను నష్టం తప్పిందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదంలో రూ.10లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.