Massive fire Nandyala : నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం.. హోటల్‌లో ఒక్కసారిగా పేలిన 3 గ్యాస్‌ సిలిండర్లు

కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌లో 3 గ్యాస్‌ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.

Massive fire Nandyala : నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం.. హోటల్‌లో ఒక్కసారిగా పేలిన 3 గ్యాస్‌ సిలిండర్లు

Massive Fire Nandyala

three gas cylinders exploded in a hotel : కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌లో 3 గ్యాస్‌ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. పెద్ద ఎత్తున శబ్దాలతో మంటలు ఎగిసిపడ్డాయి. చెక్‌పోస్ట్‌ సర్కిల్‌ చుట్టుపక్కల ఉన్న గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌, షాప్‌లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల్లోని గృహసముదాయాల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. అయితే.. హోటల్‌ గత మూడు రోజులుగా మూసి ఉంచడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

హోటల్‌లో దాదాపు 16 సిలిండర్లు ఉండడంతో పోలీసులు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భారీ పేలుడుతో నంద్యాల, నందికొట్కూరు రహదారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారని ఫైర్ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. హోటల్ మూసి ఉంచడంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదన్నారు. మొత్తం పదహారు సిలిండర్లు పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. అందులో మూడు పేలగా.. మరో మూడు సిలిండర్లు నిండుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారని వెల్లడించారు. ఇన్ని సిలిండర్లు ఎందుకున్నాయనే కోణంలో విచారణ జరుపుతామని పేర్కొన్నారు.