Mayor election : అధికార పార్టీలో బయటపడ్డ లుకలుకలు…విజయవాడ, విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు

మేయర్ ఎంపిక... వైసీపీలో చిచ్చు పెట్టింది. విశాఖ మేయర్‌ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి.

Mayor election : అధికార పార్టీలో బయటపడ్డ లుకలుకలు…విజయవాడ, విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు

Mayor Election Confusion In Ycp1

Mayor election confusion in YCP : మేయర్ ఎంపిక… వైసీపీలో చిచ్చు పెట్టింది. విశాఖ మేయర్‌ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి. తనకు మేయర్‌ పదవి దక్కకపోవడంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌ పదవి వెంకటకుమారికి కేటాయించడంపై మండిపడుతున్నారు. ఆయన మద్దతుదార్లు జీవీఎంసీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అనుచరులు ధర్నా చేపట్టారు. వంశీకృష్ణకే మేయర్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ రోజు నుంచి పార్టీ ఆఫీస్‌కు వెళ్లనని స్పష్టం చేశారు. మేయర్‌ పదవిపై తాను సీఎం జగన్‌ను కలుస్తానని పేర్కొన్నారు. సీఎం జగన్‌ ఏది చెబితే అదే చేస్తానని చెప్పారు. మేయర్‌ పదవి ఇస్తానంటేనే పోటీ చేశానని తెలిపారు. తనపై కుట్రలు చేసిన వాళ్లు అంతకంతకూ అనుభవిస్తారని పేర్కొన్నారు.

అయితే వంశీకృష్ణ శ్రీనివాస్‌కు తప్పకుండా న్యాయం చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మహిళలకు అధిన ప్రాధాన్యత ఇవ్వాలనే జీవీఎంసీ మేయర్‌గా మహిళను ఎంపిక చేసినట్టు చెప్పారు. వంశీకృష్ణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీనిచ్చారు.

అటు విజయవాడ వైసీపీలోనూ మేయర్‌ చిచ్చు చెలరేగింది. తనకు మేయర్‌ పదవి ఇవ్వకపోవడంపై 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ పుణ్యశీల అలకబూనారు. అధిష్టానంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటి క్రితం జరిగిన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారానికి ఆమె హాజరుకాలేదు. పుణ్యశీలకు మేయర్‌ పదవి దక్కకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని ఆమె మద్దతుదార్లు ఆరోపిస్తున్నారు.