Medical Mafia : ఏపీలో మెడికల్ మాఫియా.. 10టీవీ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ సంచలన నిజాలు

ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. 10టీవీ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ నిజాలు.. ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

Medical Mafia : ఏపీలో మెడికల్ మాఫియా.. 10టీవీ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ సంచలన నిజాలు

Medical Mafia In Ap Sensational Facts Revealed In 10tv Investigation

Medical Mafia in AP : ఏపీలో మెడికల్ మాఫియా రెచ్చిపోతోంది. 10టీవీ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డ నిజాలు.. ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. క్రిటికల్ కండీషన్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు వాడే ఇంజక్షన్లను.. డ్రగ్ మాఫియా బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా ఈ అక్రమ దందా సాగుతోంది.

దేశం మొత్తం కరోనా కల్లోలం రేపుతోంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లను.. మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అత్యవసరంగా వాడే ఇంజక్షన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తమవాళ్లను రక్షించుకునేందుకు.. కుటుంబసభ్యులు ఏ డ్రగ్ అయినా.. ఎంత పెట్టి కొనేందుకైనా సిద్ధమవుతున్నారు. ఈ కష్టకాలంలో.. అంతా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. కానీ.. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డ్రగ్ మాఫియాగా ఏర్పడి.. జనం అవసరాలను, ఎమర్జెన్సీని అర్థం చేసుకోకుండా లక్షల్లో దండుకుంటున్నారు. ఇలాంటి వ్యవహరమే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలిలో బయటపడింది.

క్రిటికల్ కండీషన్‌లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఇచ్చే.. టొసిలిజుమాబ్ ఇంజక్షన్లు తమ దగ్గర ఉన్నాయంటూ బేరాలు ఆడుతున్నారు కేటుగాళ్లు. 40 వేలకు దొరికే డ్రగ్‌ని.. నాలుగున్నర లక్షలకు పైనే పెంచేసి.. బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. తీరా.. కొనేందుకు రెడీ అయితే.. టొసిలిజుమాబ్ లేదు.. అలాంటిదే వేరే డ్రగ్ ఉందని చెబుతున్నారు. క్యాన్సర్‌కి వాడే డ్రగ్‌ని కూడా.. కోవిడ్‌కి వాడొచ్చని నమ్మిస్తున్నారు. టొసిలిజుమాబ్‌కి బదులు.. సిజుమాబ్ అనే క్యాన్సర్ డ్రగ్‌ని అంటగడుతున్నారు. ఈ ఇంజక్షన్ ఒరిజినల్ కాస్ట్ 43 వేలైతే.. 3 లక్షల 70 వేలకు పైనే అమ్ముతున్నారు.

ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు రెడీ అయితే.. అడ్వాన్స్‌గా ఓ పదివేలు ఆన్‌లైన్‌లో పే చేయమంటున్నారు. తర్వాత.. వాళ్ల దగ్గర డ్రగ్ కొనకపోతే.. ఆ పదివేలు వెనక్కి రావని ముందే చెప్పేస్తున్నారు. ఇంజక్షన్ తీసుకోవాలంటే.. 4 నుంచి 5 ప్లేస్ లు మారాలని.. కచ్చితంగా ఇద్దరు వ్యక్తులు రావాలని చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంగా.. బయటపడ్డ ఈ మెడికల్ మాఫియా దందా.. ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది.

హైదరాబాద్‌లో టొసిలిజుమాబ్‌ దొరకని వాళ్లను సైతం.. గుంటూరుకు రప్పించి మరీ అమ్మేస్తోంది ఈ మాఫియా. టొసిలిజుమాబ్‌కి బదులు.. డ్రగ్ మాఫియా అంటగడుతున్న సిజుమాబ్ ఇంజక్షన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ తప్పవంటున్నారు వైద్య నిపుణులు. హార్ట్ ఎటాక్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.