Vaccination: సిబ్బంది నిర్లక్ష్యం.. 31 మందికి కొవిషీల్ట్‌కు బదులు కోవాగ్జిన్‌

వ్యాక్సిన్ వివరాలు ఆన్ లైన్లో నమోదు చేస్తుండగా విషయం బయటపడింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు సిబ్బంది. ఆ 31 మందిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఐతే రెండు డోస్ లు వేరు వేరు వ్యాక్సిన్లు వేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అధికారులు తెలిపారు.

Vaccination: సిబ్బంది నిర్లక్ష్యం.. 31 మందికి కొవిషీల్ట్‌కు బదులు కోవాగ్జిన్‌

Vaccination

Vaccination: ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతుంది. ఆదివారం ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టడంతో ఒక్కరోజే 13,68,049 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు వైద్య సిబ్బంది. ఇక చిత్తూరు 1,02,862 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో ఓ చోట వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

మొదటి డోస్ కోవిషిల్డ్ తీసుకున్న వారికి ఆదివారం మెగా డ్రైవ్ లో రెండవ డోస్ కోవాగ్జిన్ టీకా ఇచ్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గుడ్యాణంపల్లెలో జరిగింది. ఆదివారం రెండో డోస్ తీసుకునేందుకు వచ్చిన వారిలో 31 మందికి కోవాగ్జిన్ టీకా ఇచ్చారు.