Mega fans association: మెగా అభిమానుల భేటీ.. జనసేన బలోపేతంకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ..

ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార పార్టీ చేసే తప్పులను ప్రజల్లో ఎండగడుతున్నారు. తాజాగా జనసేన పార్టీకి అండగా నిలిచేందుకు, వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా...

Mega fans association: మెగా అభిమానుల భేటీ.. జనసేన బలోపేతంకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ..

Pawan Kalyan (1)

Mega fans association: ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార పార్టీ చేసే తప్పులను ప్రజల్లో ఎండగడుతున్నారు. తాజాగా జనసేన పార్టీకి అండగా నిలిచేందుకు, వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చిరు, పవన్, రామ్ చరణ్ అభిమాన సంఘాల సభ్యులు సమావేశమయ్యారు. విజయవాడలోని మురళి ఫార్చున్ హోటల్ లో మెగా బ్రదర్స్ అభిమాన సంఘాలకు చెందిన ప్రముఖులు భేటీ అయ్యారు.

Pawan Kalyan: అవును.. పవన్ అలాగే కనిపిస్తాడట!

ఈ సమావేశానికి ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన మెగా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా ఉండేలా తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచణపై చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో పీఆర్పీకి సహకారం అందించిన విధంగానే రానున్న రోజుల్లో జనసేనకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలని, పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ.. జనసేన పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

Pawan Kalyan: వీరమల్లుకే పవన్ మొగ్గు.. ఎందుకంటే?

మెగా అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వస్తున్నామని, నాగబాబు త్వరలో అభిమానులందరితో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలిపారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆదేశాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా మెగా అభిమానులను సమాయత్తం చేస్తున్నామని స్వామి నాయుడు తెలిపారు. జనసేన పార్టీకి అభిమానులు అందరు అండగా ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13ఉమ్మడి జిల్లాలకు చెందిన ముఖ్యమైన వారిని మాత్రమే ఈ సమావేశంకు ఆహ్వానించినట్లు తెలిపారు. రానున్న కాలంలో జనసేనను బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకొనేలా తమవంతు సహకారం అందిస్తామని స్వామి నాయుడు తెలిపారు.