Mega vaccination : ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్..ఒకేరోజు 8లక్షల మందికి

ఏపీలో మెగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఒకేరోజు 8లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలో ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.

Mega vaccination : ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్..ఒకేరోజు 8లక్షల మందికి

Special Vaccine Drive In Ap

Mega Vaccine Drive In : ఏపీలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఒకేరోజు 8లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో ఉదయం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దీని కోసం వైద్య,ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయగా ఉదయం నుంచి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. గతంలో ఒకే రోజు 6లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించిన ఏపీ పభుత్వం నేడు అదే ఎనర్జీతో 8లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించే దిశగా వ్యాక్సిన్లు వేస్తోంది.

దీంట్లో భాగంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. వ్యాక్సిన్ వేయించుకోవటానికి జనాలు భారీగా తరలివచ్చారు. గతంలో ఒక డోసు వేయించుకున్నవారికి రెండో డోసు వేస్తున్నారు. అలాగే మొదటి డోసు వేయించుకోవటానికి వచ్చినవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ వేయటానికి 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు మొదటిప్రాధాన్యత ఇస్తున్నారు.

గతంలో కోవిషీల్డ్ మొదటిడోసు వేయించుకుని 84 రోజులు గడిచినవారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్లేవారికి కూడా టీకా వేయటానికి ప్రాధాన్యతనిస్తున్నారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 22లక్షల 83వేల 479 డోసులు వేయగా ఈరోజు 8లక్షల మందికి ఒకేరోజు వ్యాక్సిన్ వేయలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.