Megastar Chiranjeevi : రాజకీయాలకు పూర్తి దూరం.. రాజ్యసభ ఆఫర్‌పై చిరంజీవి స్పందన

టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్లు పుకార్లు షికారు చేశాయి..

Megastar Chiranjeevi : రాజకీయాలకు పూర్తి దూరం.. రాజ్యసభ ఆఫర్‌పై చిరంజీవి స్పందన

Chiru

Chiranjeevi Rajya Sabha Offer : టాలీవుడ్ నటుడు మెగాస్టార్ గా పిలుచుకునే చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెడుతారా ? ఆయనకు వైసీపీ ఆఫర్ చేసిందా అనే వార్తలు భోగి పండుగ రోజున గుప్పుమన్నాయి. టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన భేటీలో రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేసినట్లు పుకార్లు షికారు చేశాయి. దీనిపై చిరంజీవి స్పందించాల్సి వచ్చింది. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు.

Read More : Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

ఇప్పటికే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి..వరుసగా సినిమాలు చేస్తూ..బిజీ బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందనే ప్రచారానికి చిరు చెక్ పెట్టారు. తనకు వైసీపీ ఆఫర్ ఇస్తోందని వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. పదవులను కోరుకోవడం తన అభిమతం కాదని కుండబద్ధలు కొట్టారు. రాజకీయాల్లో లేని వారికి రాజ్యసభ సీటు ఇస్తారని తాను అనుకోనన్నారు.

Read More : Baby Rescued: మైనస్ డిగ్రీల చలిలో చావు బ్రతుకుల మధ్య పసికందు లభ్యం

గతంలో కూడా చిరంజీవికి వైసీపీ ఎంపీ ఆఫర్‌ ఇచ్చినా అప్పట్లో ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఏపీలో గణనీయమైన స్థాయిలో కాపు ఓట్లున్న సంగతి తెలిసిందే. ఈ ఓట్లపై జనసేన, బీజేపీ పార్టీలు ఫోకస్ పెట్టాయి. చిరంజీవిని రాజ్యసభకు పంపి కాపులను ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని టాక్. జూన్‌ 21తో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగూ వైసీపీ ఖాతాల్లోకే చేరతాయి.