Gautam Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు

మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Gautam Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు

Mekapati

Mekapati Gautam Reddy’s funeral : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎల్లుండి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ వద్ద గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొదటగా స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు. కానీ ఉదయగిరిలో అంత్యక్రియలు జరుగనున్నాయి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే గౌతం రెడ్డి భౌతిక కాయం ఉండగా.. మంగళవారం స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా భౌతిక కాయాన్ని సజావుగా తరలించవచ్చని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ అంబులెన్స్ సాయం కోసం ఎదురుచూడగా.. అందుబాటులో లేవని తెలిసింది.

Mekapati Goutham Reddy : మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలను ఖండించిన కుటుంబం

ఆర్మీ విమానంలో తీసుకెళ్లేందుకు ఆర్మీ అధికారులకు రిక్వెస్ట్ చేసుకున్నారు. అప్రూవల్ దొరకడంతో మంగళవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ ఇంటి నుంచి బేగంపేట విమానాశ్రయానికి గౌతమ్ పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ నుంచి రేణిగుంటకు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా నెల్లూరులోని ఇంటికి తీసుకెళ్లనున్నారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని డాక్టర్లు తెలిపారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్‌కు గురయ్యారు. ఇటీవలే ఆయన దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్నారు.

CM Jagan Tribute : గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం జగన్

ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన స్టాల్‌ను ప్రారంభించి.. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఇండస్ట్రీ అవకాశాల గురించి వివరించారు. ఇటీవలే ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. 1971లో మేకపాటి గౌతంరెడ్డి జన్మించారు. నెల్లూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లో రెండు సార్లు ఆత్మకూరు నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఇండస్ట్రీస్‌, కామర్స్‌, ఐటీ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేస్తున్నారు.