Mekapati VikramReddy On Result : వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు-మేకపాటి విక్రమ్ రెడ్డి

ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ మెజారిటీతో అర్థమైందన్నారు. ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.(Mekapati VikramReddy On Result)

Mekapati VikramReddy On Result : వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే గెలుపు-మేకపాటి విక్రమ్ రెడ్డి

Mekapati Vikram Reddy

Mekapati VikramReddy On Result: ఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడం సంతోషంగా ఉందన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తాను నెరవేరుస్తాను అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రజలు వైసీపీని ఎంతగా ఆదరిస్తున్నారో ఈ మెజారిటీతో అర్థమైందన్నారు. ప్రతిపక్షాలు ఇక మాట్లాడటానికి ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని మేకపాటి విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.(Mekapati VikramReddy On Result)

”నా అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా. మా కుటుంబంపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు. ఉప ఎన్నిక చాలా పారదర్శకంగా జరిగింది. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలే నా విజయానికి కారణం. సీఎం జగన్ పట్ల ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. సంక్షేమ పథకాలు మునుపెన్నడూ లేనంత గొప్పగా అమలవుతున్నాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాలే విజయానికి కారణం. మహానేత వైఎస్ఆర్ ను మరిపింపజేసేలా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారు. జగన్ సమర్థ నాయకుడు. అలాంటి వ్యక్తి నాయకత్వం రాష్ట్రానికి అవసరం” అని విక్రమ్ రెడ్డి అన్నారు.(Mekapati VikramReddy On Result)

Atmakur Bypoll Results : ఆత్మకూరులో మేకపాటి ఘన విజయం

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భ‌ర‌త్ కుమార్‌పై మేక‌పాటి ఏకంగా 82వేల 888 ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. ఈ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి డిపాజిట్ గ‌ల్లంతు కావ‌డం గ‌మ‌నార్హం. ఓట్ల లెక్కింపులో మొత్తంగా 20 రౌండ్ల పాటు కౌంటింగ్ జ‌ర‌గ్గా.. ప్ర‌తి రౌండ్‌లోనూ మేక‌పాటి ఆధిక్యం సాధిస్తూ వ‌చ్చారు. ఈ ఎన్నిక‌లో ఆయ‌న ఏక‌ప‌క్ష విజ‌యాన్ని న‌మోదు చేశారు.

YS Jagan: ఆత్మకూరు ఉప ఎన్నికలో ఘన విజయంపై జగన్ ఆసక్తికర ట్వీట్..

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో 1,37,081 ఓట్లు పోల్ కాగా… వాటిలో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి 1,02,074 ఓట్ల‌ను సాధించారు. 15వ రౌండ్ పూర్తి అయ్యే స‌రికే మొత్తం పోలైన ఓట్ల‌లో 50 శాతానికి పైగా ఓట్ల‌ను ద‌క్కించుకున్న విక్ర‌మ్ రెడ్డి అప్ప‌టికే త‌న విక్ట‌రీని ఖ‌రారు చేసుకున్నారు. ఆ త‌ర్వాత 5 రౌండ్లు ఆయ‌న‌కు ద‌క్కిన మెజారిటీని తేల్చేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయి. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో జ‌రిగిన ఈ ఎన్నికలో ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన విక్ర‌మ్ రెడ్డి విజ‌యం సాధించారు.

Bypoll Results: ఉప ఎన్నికల ఫలితాలు.. ఏ స్థానంలో ఎవరు గెలిచారు?

ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయంపై సీఎం జగన్ స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా ఆత్మకూరులో 83 వేల మెజారిటీతో విక్రమ్ ను గెలిపించారని జగన్ అన్నారు. విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని పేర్కొంటూ ట్వీట్ చేశారు సీఎం జగన్.