ఉపాధి కార్మికుల వేతనం పెంపు

ఉపాధి కార్మికుల వేతనం పెంపు

ఉపాధి కార్మికులకు శుభవార్త. మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు దినసరి వేతన మొత్తాన్నిపెంచారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రస్తుతం రూ.204 ఉన్న వేతనాన్ని రూ.211కు పెంచింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1నుంచే పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. 

ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం ప్రతి వేసవిలో ఉపాధి హామీ దినసరి వేతనాన్ని పెంచుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వేతనాన్ని పెంచే నిర్ణయం తీసుకుంటున్నాయి.