సొంతూరుకు వెళ్లేందుకు వలస కార్మికులు ఏం చేశారో తెలుసా ?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.

  • Published By: veegamteam ,Published On : April 15, 2020 / 12:52 PM IST
సొంతూరుకు వెళ్లేందుకు వలస కార్మికులు ఏం చేశారో తెలుసా ?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. నిత్యవసర సరుకులతో వెళ్తున్న రెండు వాహనాల్లో 31 మంది వలస కార్మికులు దొంగతనంగా విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు.

కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. నిత్యవసరాలు మినహా అన్నింటిని బంద్ చేశారు. ఈ నేపథ్యంలో వలస కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. వారు పడుతున్న బాధలు వర్ణణాతీతం. నగరాలు, పట్టణాల్లో పనులు బంద్ కావడంతో వీరు సొంతూళ్లకు బయలుదేరారు. వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. ఏవైనా వాహనాలు  వెళ్తే వాటిలో వెళ్తున్నారు.

ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతున్న సందర్భంగా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. వీరి కన్నుగప్పి పోవాలని అనుకున్నారు కొంతమంది కార్మికులు. హైదరాబాద్ నుంచి నిత్యావసర సరుకులతో రెండు వాహనాలు వెళుతున్నాయి. ఇందులో 31 మంది వలస కార్మికులు ఎక్కారు. 

సరుకుల మధ్యే వీరు ప్రయాణించారు. సోమవారం (ఎప్రిల్ 13, 2020) అర్ధరాత్రి దాటిన తర్వాత విజయనగరం జిల్లాలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి గజపతినగరం చేరుకున్నారు. ఇక్కడ కూడా పోలీసులు తనిఖీలు చేశారు. వీరికి అనుమానం వచ్చింది. 

లోపల ఉన్న సరుకులను పరిశీలించారు. ఒక్కొక్కరుగా కనిపించడంతో పోలీసులు షాక్ తిన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దాదాపు 31 మంది ఉన్నారని, వాహనాల్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారనుకొని పలు చోట్ల పోలీసులు విడిచిపెట్టి ఉంటారని అధికారులు అంటున్నారు. వారిని అదుపులోకి తీసుకొని పార్వతీపురం క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు చెప్పారు. బాధితుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం మండలాలకు చెందిన వారు ఉన్నారు.