Adimulapu Suresh : టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు..

Adimulapu Suresh : టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మంత్రి కీలక వ్యాఖ్యలు

Minister Adimulapu Suresh

Adimulapu Suresh : రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరీక్షల నిర్వహణపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని తెలిపారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం సీఎం జగన్ నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారని మంత్రి చెప్పారు. అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని వెల్లడించారు.

Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…

మరోవైపు స్కూళ్లు మూతపడుతాయంటూ వస్తున్న ప్రచారంపైనా మంత్రి స్పందించారు. రానున్న రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పోదని మంత్రి భరోసానిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతీ మండలానికి 2 లేదా 3 జూనియర్ కాలేజీలను మంజూరు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.

నాడు-నేడు కింద మొదటి విడతలో రూ.3700 కోట్ల ఖర్చుతో పాఠశాలలను ఆధునీకరించామని మంత్రి తెలిపారు. కొత్త స్కూళ్లు, కాలేజీలు మంజూరు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జూనియర్‌ కాలేజీలకు అదనంగా మరిన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే టీచర్ల నియామకం చేపడతామన్నారు.

కాగా, కరోనావైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. ఎగ్జామ్స్ రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై క్లాసులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. అయితే, ఎగ్జామ్స్ పెట్టకుండా విద్యార్థులను ఇలా పాస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

ముఖ్యంగా టెన్త్, ఇంటర్ అర్హతతో నిర్వహించే అనేక నియామకాలకు ఆయా విద్యార్థులు అర్హతలు కోల్పోతారని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. థర్డ్ వేవ్ సమయంలోనూ స్కూళ్లను నిర్వహించాయి. సిలబస్ ను సకాలంలో పూర్తి చేసి ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తున్నాయి. ఏపీలోనూ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరాలని ప్రభుత్వం భావిస్తోంది.