చంద్రబాబు వైఖరే పోలవరానికి శాపం. టీడీపీ బండారం బయటపెడతాం

  • Published By: naveen ,Published On : October 26, 2020 / 12:41 PM IST
చంద్రబాబు వైఖరే పోలవరానికి శాపం. టీడీపీ బండారం బయటపెడతాం

polavaram: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తప్పులు చేసిందెవరో ప్రజలకు తెలుసు అని ఏపీ మంత్రి అనిల్ అన్నారు. టీడీపీ బండారం బయట పెడతామని ఆయన చెప్పారు. సోమవారం(అక్టోబర్ 26,2020) పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు పోలవరానికి శాపంగా మారిందన్నారు.




ప్యాకేజీ కోసమే చంద్రబాబు పోలవరం బాధ్యత తీసుకున్నారు:
ప్యాకేజీ కోసమే చంద్రబాబు పోలవరం బాధ్యత తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్ట్ కి అన్యాయం జరిగిందని మంత్రి అనిల్ చెప్పారు. పోలవరం నిర్మాణం తామే చేపడతామని కేంద్రాన్ని టీడీపీ ప్రభుత్వం కోరిందన్నారు. 2013-14 అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం ప్రతిపాదనను టీడీపీ ప్రభుత్వం విస్పష్టంగా ఆమోదించిందన్నారు. 2016-17లో 20వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఆ ఒప్పందం అడ్డు పెట్టుకునే కేంద్రం ఇప్పుడు కొర్రీలు పెడుతోందన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ వైఖరి ఇప్పుడు పోలవరానికి శాపంగా మారిందన్నారు.
https://10tv.in/chandrababu-master-plan-to-get-mahesh-babu-support/


పోలవరంపై మంత్రి అనిల్ కామెంట్స్:
* పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది
* రెండేళ్ల పాటు పోలవరం ప్రాజెక్టును టీడీపీ పట్టించుకోలేదు
* 2016లో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించిన టీడీపీ పోలవరం ప్రాజెక్టును ప్యాకేజీ పరిధిలోకి తెచ్చింది
* చంద్రబాబు అభ్యర్థన మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పజెప్పారు
* ప్యాకేజీల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలు చంద్రబాబు తీసుకున్నారు
* పోలవరం విషయంలో తప్పులు చేసింది ఎవరో ప్రజలకు తెలియాలి