జగన్ లాగా.. సింహంలా సింగిల్ గా బరిలోకి దిగే దమ్ముందా?

మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

  • Published By: veegamteam ,Published On : January 21, 2020 / 05:29 AM IST
జగన్ లాగా.. సింహంలా సింగిల్ గా బరిలోకి దిగే దమ్ముందా?

మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

మంగళవారం(జనవరి 21,2020) ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఆరంభం నుంచి సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి విశ్వరూప్ ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. పొత్తులు లేకుండా టీడీపీ ఏనాడు కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదని మంత్రి అనిల్ అన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి పొత్తుల కోసం పాకులాడే పార్టీ టీడీపీ అన్నారు.

”మీ పార్టీ నెక్ట్స్ ఏ పార్టీ చంక ఎక్కబోతోంది. బీజేపీనా, సీపీఎమ్మా, సీపీఐయా, జనసేనా.. ఇంకొకటా.. పొత్తు లేనిదే ముద్దు దిగదు. మీరు కూడా మాట్లాడుతున్నారు.. పొద్దున లేస్తే ఏ పార్టీ అధికారంలో ఉందా? ఏ పార్టీ చంక ఎక్కుదామా? ఏ పార్టీ కాళ్లు మొక్కుదామా? రాహులా? మోడీయా? ఆఖరికి ట్రంపా..? మీరు కూడా కేపిటల్ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గు ఉండాలి.. వైసీపీ, జగన్ మాత్రం మీలా కాదు. జగన్ సింహంలా సింగిల్ గా పోతాం తప్ప.. పొత్తుల కోసం పోయే పార్టీ కాదు మాది. 2024లో పొత్తు లేకుండా సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం మీకుందా? చాలెంజ్.. సింగిల్ గా పోతామని చెప్పడానికి ఒక్క టీడీపీ ఎమ్మెల్యేకి కూడా దమ్ము లేదు.. మేము చెబుతున్నాం.. సింగిల్ గానే వెళతాం..” అని అనిల్ అన్నారు.

చంద్రబాబు.. మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు జోలె పట్టి ఇంకా దోచుకోండి అన్నారు. టైమ్ పదిన్నర అయ్యింది.. ఇక జోలె పట్టుకుని వెళ్లండి అని చంద్రబాబుని ఉద్దేశించి మంత్రి అనిల్ అన్నారు.